Parineeti Chopra: పెళ్లికి సిద్దమవుతున్న మరో స్టార్ హీరోయిన్.. రాజకీయ నాయకుడితో నిశ్చితార్థం డేట్ ఫిక్స్?

బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రా త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అని చాలా కాలంగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. మొదట ఈమె ఒక బాలీవుడ్ హీరో తో ప్రేమలో ఉంది అని కథనాలు వచ్చాయి. ఆ తర్వాత వ్యాపారవేత్తతో డేటింగ్ లో ఉంది అని కూడా రూమర్స్ వినిపించాయి. అయితే ఫైనల్ గా ఇప్పుడు అమ్మడు గత కొంతకాలంగా ఒక రాజకీయ నాయకుడుతో ప్రేమలో ఉంది అని త్వరలో నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నట్లుగా కథనాలు అయితే వెలువడుతున్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజకీయ నాయకుడితో ప్రేమ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణితి రిలేషన్ లో ఉన్నట్లు గొత కొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరూ ముంబయిలోని ఓ రెస్టారెంట్ లో కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా వీరిద్దరూ మరో సాలి లంచ్ చేస్తూ మీడియా కంట పడ్డారు. ఇలా వీరిద్దరూ తరచుగా ముంబైలోని పలు ప్రాంతాల్లో కనిపించగా.. అందరూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఫిక్స్ అయ్యారు.

Parineeti Chopra

ఇదే నెలలో ఎంగేజ్మెంట్: అయితే ఈ మధ్య వీరిద్దరితో పాటు డిజైనర్ మనీష్ మల్హోత్ర కూడా కనిపించడంతో... పెళ్లికి సంబంధించిన పుకార్లు మరో లెవెల్ కు వెళ్లాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని.. ముఖ్యంగా ఇదే నెలలో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు వారత్లు వస్తున్నాయి. న్యూఢిల్లీలో మే 13వ తేదీన వీరు నిశ్చితార్థం చేసుకోబోతున్నారట.

Parineeti Chopra

కొనసాగుతున్న సస్పెన్స్ : పరిణీతి, రాఘవ్ ఉంగరాలు మార్చుకుంటారట. ఆ తర్వాత వారు ఎప్పుడు, ఎక్కడ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై ఇటు పరిణీతి చోప్రా కానీ అటు రాఘవ్ చద్దా కానీ ఇంకా స్పందించలేదు. వారిద్దరూ అధికారికంగా ఈ విషయం గురించి ప్రకటించే వరకు దీనిపై సస్పెన్స్ కంటిన్యూ అయ్యేలా ఉంది.

ఇదివరకే ఆ వేడుకపై గాసిప్స్: అయితే కొన్ని నెలల క్రితమే పరిణీతి, రాఘవ్‌ల రోకా వేడుక జరిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం జరిగిందని... ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని పెద్ద పెద్ద పత్రికలు, మ్యాగజైన్లు, న్యూస్ ఛానెళ్లలో వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నందున ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది.

Parineeti Chopra

పెళ్లి వార్తపై అలా రియాక్ట్ అవుతూ..: ముంబయి ఎయిర్ పోర్టులో పరిణీతి చోప్రా మీడియా కంట పడగా.. రాఘవ్ చద్దాతో పెళ్లి గురించి ప్రశ్నించారు. దీనికి ఆమె నవ్వుతూ... "పాగల్ హోగయే హై సబ్ (అందరూ పిచ్చివాళ్ళయ్యారు)" అని బదులిచ్చారు. ఆమె సీరియస్ అవ్వడం కాకుండా నవ్వుతుండడంతో... అంతా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మరింత గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరి చూడాలి.. ఈనెల 13వ తేదీన నిజంగానే వీరి నిశ్చితార్థం జరగనుందా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X