Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ ఇద్దరు హీరోల్లో ఎవరు బాగా ముద్దుపెట్టుకొంటారంటే.. పరిణితి చోప్రా తుంటరిగా..
బాలీవుడ్లో అందాల భామ పరిణితి చోప్రా వరుస ఆఫర్లను దక్కించుకొంటూ జోరు పెంచింది. సైనా నెహ్వాల్ బయోపిక్‌తోపాటు అర్జున్ కపూర్‌తో సందీప్ ఔర్ పింకి పరార్, సిద్ధార్థ్ మల్హోత్రాతో జబ్రియా జోడి చిత్రాల్లో నటిస్తున్నది. అర్జున్ కపూర్‌తో మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత, సిద్ధార్థ్ మల్హోత్రాతో ఐదేళ్ల తర్వాత జత కడుతుండటం గమనార్హం. 2012లో అర్జున్ కపూర్‌తో ఇష్కజాదే, సిద్ధార్థ్‌తో హసీ తో ఫసీ సినిమాల్లో నటించింది. తాజాగా నేహా దూపియా నిర్వహించే చాట్ షోకు హాజరైన పరిణితి చోప్రా ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు తుంటరి సమాధానం ఇచ్చింది.
అర్జున్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రాలో ఎవరు బాగా ముద్దుపెట్టుకొంటారనే ప్రశ్నకు పరిణితి చోప్రా సమాధానం ఇస్తూ.. అర్జున్ కపూర్‌తో నాకు ఓ ప్రత్యేకమైన రిలేషన్షిప్ ఉంది. నేను ఎలా ఉంటే అలానే ఇష్టపడుతాడు. సిద్దూ కంటే అర్జున్ కపూర్తోనే నాకు కెమిస్ట్రీ బాగుంటుందని అభిప్రాయం. అందుకే అర్జున్ కపూర్ మాత్రమే బాగా ముద్దు పెట్టుకొంటాడు అని చెప్పింది. ఇష్కాజాదే చిత్రంలో అర్జున్, పరిణితి జంటకు మంచి క్రేజ్ లభించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరని చెప్పడం చాలా కష్టం. నాకున్న కంఫర్ట్ ప్రకారం అర్జున్ కపూర్ నాకు మంచి మిత్రుడు అని చెప్పగలను అని పరిణితి చోప్రా వెల్లడించింది. కాగా, సిద్ధార్థ్‌తో కలిసి నటించిన జబ్రియా జోడి చిత్రం ఆగస్టు 2 తేదీన రిలీజ్ కానున్నది.
ఇక బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ కోసం బాడ్మింటన్ క్రీడలో శిక్షణ పొందుతున్నది. ఫిట్ నెస్ కోసం టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా నుంచి చిట్కాలు నేర్చుకొంటున్నది. త్వరలోనే ఈ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లనున్నది.