ప్రియాంకకు కాబోయే భర్త నుంచి... రూ. 36 కోట్లు డిమాండ్ చేస్తున్న పరిణీతి!
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా త్వరలో అమెరికన్ సింగర్, హాలీవుడ్ యాక్టర్ నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం భారతీయ సాంప్రదాయం ప్రకారం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరుగనున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రియాంక సోదరి.... పరిణీతి చోప్రా నిక్ జొనాస్‌ను 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 36 కోట్లు) డిమాండ్ చేస్తుంటం చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయట.

అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి?
సాధారణంగా ఉత్తరాధిన జరిగే పెళ్లి వేడుకల్లో ‘ఝూటా చోర్' అనే కార్యక్రమం ఉంటుంది. అంటే వరుడి పాదరక్షలు దాచేసి ఆటపట్టించడం అన్నమాట. వరుడు పెళ్లి మండపంలోకి వచ్చిన తర్వాత వధువు తోబుట్టువులు ఈ పని చేస్తుంటారు. వాటిని తిరిగి ఇవ్వడానికి వరుడి నుంచి డబ్బు డిమాండ్ చేస్తుంటారు. ఇదొక సరదా సాంప్రదాయం.

5 మిలియన్ డాలర్స్ డిమాండ్ చేస్తానంటున్న పరిణీతి
ప్రియాంక పెళ్లి వేడుకలో ‘ఝూటా చోర్' కార్యక్రమం పరిణీతి చోప్రా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. నిక్ జొనాస్ నుంచి 5 మిలియన్ డాలర్లు డిమాండ్ చేయాలనే ప్లాన్ వేస్తున్నారట. అంటే మన కరెన్సీ లెక్కల ప్రకారం రూ. 36 కోట్లు.

ఇద్దరి మధ్య బేరసారాలు
‘ఝూటా చోర్' గురించి ముందే నిక్ జొనాస్‌కు చెప్పిందట పరిణీతి. ఫైనల్ అమౌంట్ విషయంలో ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయట. అయితే నిక్ మాత్ర 10 డాలర్లకంటే ఎక్కువ ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడట, అలా చేస్తే నువ్వు చెప్పుల్లేకుండా మా అక్కను తీసుకుని అమెరికా వెళ్లాల్సిందే భీష్మించుకుని కూర్చుందట పరిణీతి.

జోధ్‌పూర్‌లో వైభవంగా వివాహం
ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ ఎంగేజ్మెంట్ జులై 18న జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వీరి వివాహం జరుగబోతోంది. ఇక్కడి ఉమైద్ భవన్ ప్యాలెస్ హోటల్‌లో ఈ వేడుక ప్లాన్ చేశారు. ఈ వేడులో ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, సన్నిహితులు కలిపి దాదాపు 200 మంది పాల్గొంటారని సమాచారం.


Click it and Unblock the Notifications











