అసిస్టెంట్ డైరెక్టర్‌తో స్టార్ హీరోయిన్ పెళ్లి.. అక్కదారిలోనే..
బాలీవుడ్‌లో పెళ్లి సీజన్ జోరందుకున్నట్టు కనిపిస్తున్నది. దీపికా పదుకొన్, ప్రియాంక చోప్రా పెళ్లి తర్వాత మరో తార పరిణితి చోప్రా పెళ్లి పీటలెక్కపోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ప్రియాంక చోప్రాకు పరిణితి సోదరి అనే విషయం తెలిసిందే. బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. పరిణితి చోప్రా తన కాబోయే వరుడిని వెతుక్కొన్నట్టు సమాచారం. అయితే అధికారికంగా పరిణితి చెప్పకపోవడంపై ఓ సందేహం నెలకొన్నది. వివరాల్లోకి వెళితే...

చరిత్ దేశాయ్‌తో డేటింగ్
ప్రస్తుతం చరిత్ దేశాయ్ అనే యువకుడితో పరిణితి చోప్రా పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్టు తెలిసింది. చరిత్ దేశాయ్ గతంలో కరణ్ జోహర్ ప్రొడక్షన్‌లో పనిచేశారు. ఆ సమయంలో ఓ డ్రీమ్ టూర్ సందర్బంగా చరిత్‌తో పరిణితి ప్రేమలో పడింది. అప్పటి నుంచి డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం.

అసిస్టెంట్ డైరెక్టర్‌తో పరిణితి
అగ్నిపథ్ సినిమాకు చరిత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ చిత్రంలో ప్రియాంక, హృతిక్ రోషన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే పరిణితితో చరిత్‌కు పరిచయం జరిగిందని కథనంలో పేర్కొన్నారు. అయితే వారిద్దరూ ఎప్పడూ తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

గతంలో మనీష్ శర్మ అఫైర్
గతంలో మనీష్ శర్మ అనే వ్యక్తితో పరిణితి చోప్రా డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అతనితో ఉన్న ప్రేమను వ్యక్తపరిచకపోయినా తనను ముందుకు నడిపించే శక్తి లాంటి వాడని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అదే విధంగా నా జీవితంలోకి ప్రవేశించిన ఏంజెల్ అని మనీష్ శర్మ చెప్పేవాడు.

సోదరి ప్రియాంక చోప్రా పెళ్లిలో
ఇటీవలే తన సోదరి ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకొన్నారు. ఈ పెళ్లిలో పరిణితి సందడి చేసింది. బావ నిక్ జోనస్‌తో సరదాగా గడిపింది. నా సోదరి పెళ్లిలో డ్యాన్సులు చేయడం నాకు సంతోషాన్ని నింపింది. వాళ్లు కూడా నా పెళ్లిలో సరదాగా గడపాలని కోరుకొంటున్నాను అని పరిణితి చోప్రా పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











