ఎంత జాగ్రత్తగా ఉన్నా అలా జరిగింది.. షూటింగ్‌కు బ్రేక్.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

సినిమా కోసం హీరోలే ఎక్కువగా కష్టపడతారని అందరూ అనుకుంటారు.. ఎందుకుంటే యాక్షన్ సీక్వెన్స్‌లు చేయాల్సింది వారే కాబట్టి వారే ఎక్కువగా కష్టపడుతుంటారని, అందుకే వారికే గాయాలవుతాయని భావిస్తుంటారు. మారుతున్న కథలు, తెరకెక్కిస్తున్న విధానంలో హీరో, హీరోయిన్లు ఒళ్లు హూనం చేసుకోవాల్సి వస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, బయోపిక్ చిత్రాలను తెరకెక్కించే క్రమంలో హీరోలు, హీరోయిన్‌లు ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రీడా నేపథ్యమున్న చిత్రాలను తీసేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారు గాయాల పాలైతే.. మధ్యలో షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది.

బయోపిక్ తెరకెక్కించడంలో కష్టాలు..

బయోపిక్ తెరకెక్కించడంలో కష్టాలు..

బయోపిక్ తెరకెక్కించడంలో ఉండే కష్టాలు మరే చిత్రంలోనూ ఉండవు. ఎందుకుంటే వారి రూపు రేఖలకు దగ్గరగా ఉండేట్టు శరీరాకృతిని మార్చుకోవడం, వారికి ప్రావీణ్యం ఉన్న రంగాన్ని ప్రాక్టీస్ చేయడం.. బాక్సింగ్‌లో మేరీకోమ్‌లా ప్రియాంక మారడం, క్రికెట్‌లో ఎమ్ఎస్ ధోనిలా సుశాంత్ కనబడటానికి చాలానే కష్టపడ్డారు. అందుకు బయోపిక్ తీయడం అంటే కత్తిమీద సాములాంటిదని అంటారు.

ఎన్నో మార్పులకు గురైన సైనా నెహ్వాల్ బయోపిక్..

ఎన్నో మార్పులకు గురైన సైనా నెహ్వాల్ బయోపిక్..

అదే క్రమంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైనా చిత్రం ఎన్నో ట్విస్ట్‌లకు గురైంది. మొదటగా ఈ సినిమాలో శ్రద్దా కపూర్ ఎంటర్ అయి.. కొన్ని రోజులు నెట్ ప్రాక్టీస్ చేసింది కూడా. కానీ అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

ఎంటరైన పరిణీతి..

శ్రద్దా కపూర్ తప్పుకోగా.. డైలామాలో పడ్డ చిత్రబృందం పరిణీతిని ఎంచుకున్నారు. పరిణీతి కూడా తన పాత్రకు న్యాయం చేయాలని తెగ కష్టపడుతోంది. పాత్ర కోసం బ్యాడ్మింటన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పరిణీతి కూడా పట్టుదలతో ఆటను రోజూ ప్రాక్టీస్ చేస్తూ అందులోని మెలుకువలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని సమాచారం. అయితే ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో పరిణీతి గాయపడినట్టు, ప్రస్తుతం విరామం తీసుకుంటోన్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

Recommended Video

#CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..

‘డ్యూడ్స్‌... ‘సైనా' షూటింగ్‌ సమయంలో నాకు చిన్న గాయం కూడా కాకుండా నేను, చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ అది జరిగిపోయింది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత బ్యాడ్మింటన్‌ ఆడేందుకు మళ్లీ సిద్ధమైపోతాను అని పరిణీతి ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు. మెడకు బ్యాండేజ్‌తో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X