Parineeti Chopra: మాట మార్చేసిన పరిణితి.. పొలిటీషియన్ ను అసలు పెళ్లి చేసుకోను అంటూ

బాలీవుడ్ క్యూట్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా ఎంగేజ్ మెంట్ కన్నుల పండువగా జరిగింది. ఢిల్లీ కపుర్తాలా హౌస్ లో మే 13వ తేదీ సాయంత్రం వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే అందరి మధ్య ఉంగరాలు మార్చుకున్న ఈ జంట.. ఈ ఏడాది చివరకల్లా పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. అయితే ఎంపీతో పరిణీతి చోప్రా నిశ్చాతార్థం జరిగినప్పటి నుంచి ఆమె గతంలో చేసిన కొన్ని కామెంట్లు వైరల్ గా మారాయి. ఆ వివరాల లోకి వెళితే..

Pariniti Chopra:

అబద్ధం అని అనుకున్నారు: బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా ఎన్నో డిఫరెంట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. అయితే ఈ బ్యూటీ హఠాత్తుగా లవ్ లో ఉన్నట్లు వార్తలు రావడంతో అందరూ కూడా దాన్ని అబద్ధం అని అనుకున్నారు. కానీ ఆమె ఏకంగా పొలిటికల్ లీడర్ ను పెళ్లి చేసుకుంటూ ఉండడం వైరల్ గా మారింది. అయితే ఆమెకు సంబంధించిన మరికొన్ని వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Pariniti Chopra:

ఎప్పటికీ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోను: అవేంటంటే.. గతంలో తాను ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్లు చేసింది. తాను ఎప్పటికీ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని వివరించింది. అంతేకాకుండా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పుకొచ్చింది. తనను పెళ్లి చేసుకోబోయే వాడు ఫన్నీగా ఉండాలని, అతని దగ్గర నుంచి ఎప్పుడూ గుడ్ స్మెల్ మాత్రమే రావాలని చెప్పింది. అలాగే తనను ఎప్పుడూ గౌరవించే వ్యక్తి అయి ఉండాలని పేర్కొంది.

Pariniti Chopra:

మాట మార్చడంతో.. వీడియో వైరల్: వారి ఇష్టాలను వారు గౌరవించుకుంటూ తనతో ప్రయాణాన్ని సాగించే వారంటేనే తనకు ఇష్టం అని స్పష్టం చేసింది. గతంలో పొలిటీషియన్ ను చేసుకోనని చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ ఎంపీని చేసుకోబోతుండడంతో.. ఆమె చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇదేంటమ్మడు మరి అంటూ అడుగుతున్నారు. అప్పుడు రాజకీయ నాయకుడిని వివాహం చేసుకోనని చెప్పిన నువ్వేనా.. ఇప్పుడు ఎంపీని పెళ్లి చేసుకోబోయేదంటూ ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై క్యూట్ బ్యూటీ పరిణీతి చోప్రా ఎలా స్పందిస్తుందో చూడాలి.

అప్పటి నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం: పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కలిసి చదువుకున్నారు. వారికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీరి ద్వారా పరిచయం పెరిగింది. అది కాస్తా ప్రేమగా మారగా.. కొద్ది వారాల క్రితమే ఈ విషయం బయటకు వచ్చింది. వీరిద్దరూ కలిసి ఓ హోటల్ కు డిన్నర్ డేట్ కు వెళ్లగా... ఆ సమయంలో కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఎంపీ రాఘవ్ చద్దా తమ పెళ్లి గురించి ప్రకటించడంతో అది నిజమేనని తేలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X