Pathaan: పఠాన్ టీమ్ బంపర్ ఆఫర్.. ఆ ఒక్కరోజు మాత్రం సగం రేటుకే టికెట్లు

దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై తనదైన రీతిలో ప్రభావాన్ని చూపిస్తూ సూపర్ స్టార్‌గా దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. కెరీర్ ఆరంభం నుంచే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుంటోన్న ఆయన.. ఎప్పటికప్పుడు విభిన్నమైన చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్నాడు. అయితే, దాదాపు ఐదేళ్ల పాటు ఈ సీనియర్ హీరో సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే గత జనవరిలో సీనియర్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ 'పఠాన్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ హీరోగా.. మరో స్టార్ జాన్ అబ్రహం విలన్‌గా.. సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన 'పఠాన్' మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. అనుకున్నట్లుగానే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన స్పందన కూడా దక్కింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే 'పఠాన్' సినిమా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 501.85 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 970 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇలా ఈ చిత్రం ఎన్నో రికార్డులను కూడా బ్రేక్ చేసేసింది.

Pathaan Movie Team Decreases Ticket Rates for Next Friday Shows Across All India

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్' మూవీ ఇప్పుడు నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. అయినప్పటికీ ఈ సినిమాకు స్పందన మాత్రం వస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా చిత్ర యూనిట్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే.. వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 17)వ తేదీన ఇండియా వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఈ సినిమా టికెట్ ధరను రూ. 110 రూపాయలకే తగ్గించింది. అంటే.. మల్టీఫ్లెక్స్‌ల్లో దాదాపు రూ. 250కి వరకూ ఉన్న ధరను సగానికి సగం తగ్గించేసింది. దీంతో ఆరోజు ఈ సినిమాకు మరింతగా ఆదరణ పెరిగే అకవాశం ఉందని చెప్పొచ్చు.

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి సంగీతం ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X