Pathaan Teaser Review పఠాన్ జిందా హై అంటూ షారుక్ ఖాన్ హై ఎనర్జీతో.. దీపిక గ్లామర్ ట్రీట్ అదుర్స్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం విడుదలకు సిద్దమవుతున్నది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. షారుక్ ఖాన్ జన్మదినం సందర్భంగా పఠాన్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

 పఠాన్ బతికే ఉన్నాడో లేదో అంటూ

పఠాన్ బతికే ఉన్నాడో లేదో అంటూ


పఠాన్ ట్రైలర్ హై యాక్షన్, ఎమోషన్‌ అంశాలను జొప్పించి కట్ చేశారు. ట్రైలర్‌లో.. పఠాన్ గురించి నీ వద్ద ఏదైనా సమాచారం ఉందా? అంటే.. మూడేళ్ల నుంచి అతడి ఆచూకీ లేదు.. మూడేళ్ల క్రితం ఓ మిషన్‌లో పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతడిని విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారు. అయితే అతడు బతికే ఉన్నాడో లేదో.. అంటూ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొంటుంటే.. షారుక్ ఖాన్.. ఎంట్రీ ఇచ్చాడు. పఠాన్ బతికే ఉన్నాడు అనే డైలాగ్స్‌తో ఊర మాస్ గెటప్‌తో తెర మీద కనిపించడం... ఫ్యాన్స్ పండుగలా మారిందనే చెప్పాలి..

 హాలీవుడ్ సినిమాను తలపించేలా

హాలీవుడ్ సినిమాను తలపించేలా


పఠాన్ టీజర్‌లో యాక్షన్ సీన్లు, ఫైట్స్ హైలెట్‌గా కనిపించాయి. రక్తంతో తడిసిన దుస్తులు.. విమానాలు, హెలికాప్టర్లతో చిత్రీకరించిన సన్నివేశాలు హాలీవుడ్ సినిమాను తలపించేలా చేశాయి. ఇక బైక్ ఛేజింగ్ సీన్లు.. పర్వత ప్రాంతాల్లో షూట్ చేసిన సన్నివేశాలు టెక్నికల్‌గా బాగున్నాయి. చాలా రోజులుగా అభిమానులకు దూరమైన షారుక్ ఖాన్.. ఫుల్ మీల్స్‌ లాంటి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు టీజర్ పటాపంచలు చేసింది.

 దీపిక గ్లామర్ ట్రీట్ అదుర్స్

దీపిక గ్లామర్ ట్రీట్ అదుర్స్


పఠాన్ టీజర్‌లో దీపిక పదుకోన్ అందాల ఆరబోతతో మరింత స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. కేవలం గ్లామర్ షోకు పరిమితం కాకుండా దీపిక.. ఫైట్స్, యాక్షన్ సీన్లలో కనిపించింది. ఇక విలన్‌గా జాన్ అబ్రహం ఎంట్రీ ట్రైలర్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మార్చింది. జాన్ అబ్రహం, షారుక్ ఖాన్ మధ్య యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకొన్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి.. అంటూ

ఇక మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి.. అంటూ


పఠాన్ టీజర్‌లో బాంబ్ బ్లాస్ట్‌లు ఎక్కువగానే కనిపించాయి. ఇక భూమ్ అంటూ వాహనాలు పేల్చేయడం చూస్తే భారీగానే ఖర్చు పెట్టినట్టు స్పస్టమైంది. వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.. మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ షారుక్ హెచ్చరించడం ద్వారా టీజర్ హై ఓల్టేజ్ ఎనర్జీతో ముగిసింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న షారుక్‌కు పఠాన్ మళ్లీ పూర్వవైభవం తెస్తుందా అనే వేచి చూడాల్సిందే..

 యష్ రాజ్ ఫిలింస్ 50వ సినిమా

యష్ రాజ్ ఫిలింస్ 50వ సినిమా


పఠాన్ మూవీ విషయానికి వస్తే.. ప్రఖ్యాత యష్ రాజ్ ఫిలిం బ్యానర్‌లో వస్తున్న 50వ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని 2023 జనవరి 25వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రం హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుక్ ఖాన్ మూవీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొన్నది.

 పఠాన్ మూవీలో తారలు, సాంకేతిక నిపుణులు

పఠాన్ మూవీలో తారలు, సాంకేతిక నిపుణులు


నటీనటులు: షారుక్ ఖాన్, దీపిక పదుకోన్, జాన్ అబ్రహం
కథ, డైరెక్టర్: సిద్దార్థ్ ఆనంద్
స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్
డైలాగ్స్: అబ్బాస్ టైర్‌వాలా
నిర్మాత: ఆదిత్య చోప్రా
డీవోపీ: సాచిత్ పౌలోస్
మ్యూజిక్: విశాల్ శేఖర్
కొరియోగ్రఫి: వైభవీ మర్చంట్
రిలీజ్ డేట్: 2022-11-25

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X