For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెక్స్ అంటే చాలా ఇష్టం.. నాకు నచ్చిన వాళ్లతో తిరుగుతాను: యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

  By Manoj
  |

  దక్షిణాదిలోని నటులతో పోలిస్తే హిందీ సినీ పరిశ్రమకు చెందిన నటులు కొంచెం బోల్డుగా వ్యవహరిస్తారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ డేటింగ్ అనేది అంతగా వినిపించని పదం అయితే.. బాలీవుడ్‌లో మాత్రం అదో సాధారణ అంశం. అందుకే అక్కడి నటీనటులు ఈ వ్యవహారంపై తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అదే సమయంలో బోల్డ్ స్టేట్‌మెంట్లు కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది ఈ తరహా ప్రవర్తనతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పుడదే జాబితాలోకి ఓ యంగ్ హీరో వచ్చి చేరాడు. ఇంతకీ ఎవరా హీరో.? వివరాల్లోకి వెళితే..

  తరచూ వార్తల్లో నిలిచే ఆ హీరో ఎవరంటే

  తరచూ వార్తల్లో నిలిచే ఆ హీరో ఎవరంటే

  పైన చెప్పుకున్న హీరో ఎవరంటే.. బాలీవుడ్‌‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువగా పేరు సంపాదించుకున్న కార్తీక్ ఆర్యన్. ‘ప్యార్ కా పంచ్‌నామా' అనే సినిమా ద్వారా బీ టౌన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు.

  స్టార్ హీరో కూతురితో ఎఫైర్

  స్టార్ హీరో కూతురితో ఎఫైర్

  కార్తీక్ ఆర్యన్.. సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసి పోయింది. ఆ తర్వాతి నుంచి ఈ జంట షూటింగ్ కోసం వెళ్లినప్పుడు.. బయట కూడా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఈ క్రమంలోనే వీళ్లు ఈ మధ్య పలుమార్లు కెమెరాల కంటికి కూడా చిక్కుతున్నారు.

  ఇంట్లో భార్యతో.. ఆఫీసులో ప్రియురాలితో

  ఇంట్లో భార్యతో.. ఆఫీసులో ప్రియురాలితో

  ఈ యంగ్ టాలెంటెడ్ హీరో తాజాగా నటించిన చిత్రం ‘పతి పత్నీ ఔర్ వో'. ముదస్సర్ అజీజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో భూమి పెడ్నేకర్, అనన్య పాండే కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ పెళ్లైన వ్యక్తిగా కనిపించాడు. ఇంట్లో భార్యను అమితంగా ప్రేమిస్తూనే.. ఆఫీసులో పని చేసే యువతితో ఎఫైర్ కొనసాగిస్తుంటాడు. ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది.

  అడల్ట్ కంటెంట్‌కు బాలీవుడ్ ఫిదా

  అడల్ట్ కంటెంట్‌కు బాలీవుడ్ ఫిదా

  అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన ‘పతి పత్నీ ఔర్ వో' సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వస్తోంది. అస్సలు ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించింది. అంతేకాదు, కలెక్షన్ల పరంగా దుమ్ము దులుపుతోంది. ఫస్ట్ డే రూ. 8.50 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. నాలుగు రోజుల్లోనే రూ. 41 కోట్లు రాబట్టింది.

  CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
  సెక్స్ అంటే చాలా ఇష్టం

  సెక్స్ అంటే చాలా ఇష్టం

  ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్‌‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కార్తీక్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘మీకు సెక్స్ ఇష్టమా.? సినిమా ఇష్టమా' అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. ‘నాకు సెక్స్‌ అంటేనే ఇష్టం. అదే సమయంలో సినిమా కూడా ఇష్టమే. నాకు నచ్చినట్లు ఉండడమంటే ఇంకా ఇష్టం. అందుకే నాకు నచ్చిన వాళ్లతో తిరుగుతా' అంటూ సమాధానం ఇచ్చాడు.

  English summary
  Kartik Tiwari, better known as Kartik Aaryan, is an Indian actor who appears in Hindi films. Born and raised in Gwalior, he relocated to Navi Mumbai to pursue an engineering degree in biotechnology. He simultaneously dabbled in modelling and made attempts to start a career in film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X