అనురాగ్ కశ్యప్‌కు నార్కో, లైడిటెక్టర్ పరీక్షలు.. పాయల్ ఘోష్ పిటిషన్ దాఖలు

లైంగికదాడి కేసులో ముంబై పోలీసుల విచారణకు హాజరైన దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ మరోసారి విరుచుకుపడ్డారు. పోలీసుల విచారణ తర్వాత తన లాయర్ చేత అనురాగ్ కశ్యప్ విడుదల చేసిన ప్రకటనను పాయల్ తప్పుబట్టారు. గురువారం అనురాగ్ కశ్యప్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించిన విషయం తెలిసిందే. అనంతరం తన లాయర్ చేత విడుదల చేసిన ఓ ప్రకటనలో..

శ్రీలంకలో ఉన్నానంటూ..

శ్రీలంకలో ఉన్నానంటూ..

పాయల్ ఘోష్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. తనపై లైంగిక దాడి చేసినట్టు చెబుతున్న సమయంలో తాను శ్రీలంకలో షూటింగులో ఉన్నాను. ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆమె చట్టాలను అగౌరవిస్తున్నారు అంటూ తన లాయర్ ప్రియాంక ద్వారా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తాను శ్రీలంకలో ఉన్నట్టు ఆధారాలను పోలీసులకు ఇచ్చినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

కేసు నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నాలు

కేసు నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నాలు

అయితే అనురాగ్ కశ్యప్‌ ముంబై పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. తన ఆరోపణలు తప్పు అంటూ ఈ కేసు నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అనురాగ్ కశ్యప్‌కు నార్కో పరీక్షలు నిర్వహించాలని తన తరఫు లాయర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు అని పాయల్ ట్వీట్ చేశారు.

అనురాగ్ కశ్యప్‌కు నార్కో పరీక్షలు జరిపించాలి

అనురాగ్ కశ్యప్‌కు నార్కో పరీక్షలు జరిపించాలి

పాయల్ ట్వీట్ చేస్తూ మిస్టర్ కశ్యప్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో అబద్దాలు ఆడారు. ఆయన చేత నిజాలు చెప్పించడానికి నార్కోటిక్ అనాలిసిస్, లై డిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించేలా నా లాయర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. నాకు న్యాయం జరిగేందుకు ఇలాంటి పరీక్షలు అవసరం అని పాయల్ ఘోష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తన ట్వీట్‌ను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా‌కు ట్యాగ్ చేశారు.

Recommended Video

Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
లైంగిక దాడి ఆరోపణలు చేశారంటూ

లైంగిక దాడి ఆరోపణలు చేశారంటూ

ఇటీవల దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ లైంగిక దాడి ఆరోపణలు చేయడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. 2013లో ఆఫర్ ఇస్తానని చెప్పి తనను ఇంటికి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డారు అని ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అనురాగ్‌ కశ్యప్ ముంబై పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ప్రకటనను విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X