అనురాగ్ కశ్యప్‌ను అరెస్ట్ చేయాలి.. పాయల్‌కు పెరుగుతున్న సినీ, రాజకీయ మద్దతు

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక దాడి ఆరోపణలు చేసిన హీరోయిన్ పాయల్ ఘోష్‌కు మద్దతు పెరుగుతున్నది. తాను ఫిర్యాదు చేసినా దర్శకుడిపై చర్యలు తీసుకోవడం లేదని పాయల్ ఆరోపణల చేసిన తర్వాత ఆమెకు అండగా సినీ, రాజకీయ ప్రముఖులు నిలుస్తున్నారు. ఆమెకు షెర్లీన్ చోప్రా, కంగన రనౌత్‌తోపాటు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ రామ్‌దాస్ అథవాలే మద్దతుగా నిలిచారు. అనురాగ్ కశ్యప్‌‌పై పాయల్ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై అథవాలే ఆగ్రహం వ్యక్తం చేస్తూ..

Recommended Video

#PayalGhosh : Anurag Kashyap Responds To Payal Ghosh's Comments || Oneindia Telugu
అనురాగ్ కశ్యప్‌‌ను అరెస్ట్‌ చేయాలి: ఆర్పీఐ నేత అథవాలే డిమాండ్

అనురాగ్ కశ్యప్‌‌ను అరెస్ట్‌ చేయాలి: ఆర్పీఐ నేత అథవాలే డిమాండ్

పాయల్‌ ఘోష్‌పై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీ రామ్‌నాథ్ అథవాలే డిమాండ్ చేశారు. అనురాగ్ కశ్యప్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు సినీ, రాజకీయ నేతల అండ ఉండటం వల్లనే అరెస్ట్ చేయడం లేదని ఆరోపించారు. పాయల్‌ ఘోష్‌కు అండగా ఉంటామని, ఆమెకు ఆర్పీఐ పార్టీ రక్షణ కల్పిస్తుందని అన్నారు.

నిరాహార దీక్ష చేపడతానని పాయల్ హెచ్చరిక

నిరాహార దీక్ష చేపడతానని పాయల్ హెచ్చరిక

దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై చర్యలు తీసుకోకపోతే తాను నిరాహార దీక్ష చేపడుతానని హెచ్చరించారు. తక్షణ న్యాయం జరిగేలా ముంబై పోలీసులు వ్యవహరించాలన్నారు. ఈ కేసులో పోలీసులు అనుసరిస్తున్న తీరుపై పాయల్ ఘోష్ న్యాయవాది అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫిర్యాదు తర్వాత పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు.

పాయల్ ఫిర్యాదుపై దర్యాప్తు

పాయల్ ఫిర్యాదుపై దర్యాప్తు

కాగా, అనురాగ్ కశ్యప్‌ కేసుపై ఆరోపణలు రావడంపై ముంబై పోలీసు విభాగం స్పందించింది. బాధితురాలి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశాం. ఇప్పటికే ఐపీసీ 376 (ఐ) అత్యాచారం, 354 లైంగిక దాడి, 341, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. పాయల్ ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నాం అని ముంబై పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

ఎన్సీబీ అధికారులు ఫిర్యాదు

ఎన్సీబీ అధికారులు ఫిర్యాదు

ఇదిలా ఉండగా, అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ మరో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది. నార్కోటిక్ డ్రగస్అండ్ సోకోట్రాపిక్ స్టాబస్ట్సాన్సెస్ యాక్ట్ కింద ఫిర్యాదును అందించినట్టు తెలుస్తున్నది. పాయల్ ఫిర్యాదుపై ఎన్సీబీ ఎలా స్పందిస్తుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X