అనురాగ్ కశ్యప్ అరాచకాన్ని చెప్పాను.. ఇక ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధం.. పాయల్ ఘోష్

పాయల్ ఘోష్ ఉన్నట్టుంది నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఆమె చేసిన ఆరోపణలు, వివరించిన తీరు అలాంటిది. బాలీవుడ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ దేశమొత్తం ఉలిక్కిపడింది. అతడు ఆమెతో ప్రవర్తించిన తీరును పూస గుచ్చినట్టు బహిరంగంగా వెల్లడించింది. ఇక ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తున్నాయి. తాజాగా మళ్లీ పాయల్ ఘోష్ స్పందించింది.

Recommended Video

#PayalGhosh : Anurag Kashyap Responds To Payal Ghosh's Comments || Oneindia Telugu
అనురాగ్‌పై ఆరోపణలు..

అనురాగ్‌పై ఆరోపణలు..

అనురాగ్ కశ్యప్‌పై క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఆరోపణలు చేసిన పాయల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు మీడియాలో మాట్లాడుతూ... పాయల్ ఘోష్ అనురాగ్ బండారాన్ని బయటపెట్టింది. ఇంటికి పిలిచి ఎలా ప్రవర్తించాడో వివరించింది. అనురాగ్ చేసిన చేష్టలు, పాయల్ చెప్పిన మాటలు రాయడానికి కూడా అంత సులువు కాదు.

అనురాగ్ చీకటి కోణం..

అనురాగ్ చీకటి కోణం..

హ్యుమా ఖురేషి, మహీ గిల్ లాంటి వాళ్లు తనతో పనిచేశారని, వాళ్లు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారని అన్నాడట.ఎప్పుడు పిలిస్తే అప్పడు వచ్చి పడుకొంటారుని చెప్పాడట. అనురాగ్ చీకటి కోణాన్ని ఇలా పాయల్ బట్టబయలు చేసేసింది. ఇక పాయల్ వ్యాఖ్యలను సమర్థించేవారున్నారు. అదే సమయంలో ఆమెను వ్యతిరేకించేవారున్నారు.

తాప్సీ మద్దతు..

తాప్సీ మద్దతు..

పాయల్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నట్టుగా వాటిని ఖండించినట్టుగా తాప్సీ ట్వీట్ చేసింది. అనురాగ్ భుజం మీద చేతులు వేసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇది నీ కోసమే నా ఫ్రెండ్.. నువ్ మంచి స్త్రీ వాదివి అని నాకు తెలుసు. మళ్లీ మనం సెట్స్‌లో కలుసుకుందాం.. నాకు తెలుసు ఈ సారి నువ్ ఓ అద్భుతమైన, శక్తివంతమైన మహిళను తెరపై చూపించబోతోన్నావ్ అంటూ అనురాగ్ అలాంటి వాడని కాదని చెప్పకనే చెప్పింది.

కంగనా ఎంట్రీ..

కంగనా ఎంట్రీ..

అసలే గత కొన్ని రోజులుగా కంగనా అనురాగ్ మధ్య మాటల యుద్దం జరగుతోంది. ఇక పాయల్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రతీ ఒక్కరి స్టేట్మెంట్ ముఖ్యమే అరెస్ట్ అనురాగ్ అంటూ ట్వీట్ చేసింది. ఇక మహిళా కమిషన్ సైతం రంగంలోకి దిగింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇన్ని రోజులు ఎదురుచూసి, ఆలోచించి బాగానే ఆరోపణలు చేసిందని అనురాగ్ కౌంటర్ వేశాడు.

ఎదుర్కొనేందుకు సిద్దం..

ఎదుర్కొనేందుకు సిద్దం..

తాజాగా పాయల్ ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ మరోసారి అనురాగ్ అకృత్యాల గురించె చెప్పింది. మొదటి సారి తన మేనేజర్‌తో కలిసి ఇంటికి వెళ్లినప్పుడు ఎంతో బాగా మాట్లాడాడని తెలిపింది. రెండో సారి పిలిచినప్పుడు వెళ్తే అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. ఆయన చేసిన పనులే చెప్పాను... ఇక ఏం జరిగినా చూసుకుంటా.. ఎదుర్కొనేందుకు సిద్దమని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X