గదిలోకి తీసుకెళ్లి బ్లూ ఫిలిమ్స్ చూపించాడు.. దర్శకుడి బండారం బయటపెట్టిన ఊసరవెల్లి నటి
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎన్నో రకాల కాంట్రవర్సీ వివాదాలు మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. కానీ ఈ సారి సుశాంత్ డెత్ కేసు, అలాగే డ్రగ్స్ వివాదం అంతకు మించిన కాంట్రవర్సీలకు దారి తీస్తోంది. అలాగే నెపోటిజమ్, మీటూ ఆరోపణలు కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఊసరవెల్లి సినిమా నటి పాయల్ ఘోష్ కూడా ఒక దర్శకుడి బండారం బయటపెట్టింది.

ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలు
మంచు మనోజ్ ప్రయాణం సినిమా ద్వారా టాలీవుడ్ కి సింపుల్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పాయల్ ఘోష్. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఊసరవెల్లి సినిమాలో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా ఈ బ్యూటీ వివరణ ఇచ్చింది.

అప్పుడే అనుమానం వచ్చింది
పాయల్ మాట్లాడుతూ.. నేను గతంలో ఒక దర్శకుడిని కలిశాను. కథా చర్చల కోసం పిలిచారేమో అని అతని ఇంటికి పిలవగానే వెళ్ళాను. మొదట్లో నన్ను గారభం చేశారు. ఆ తరువాత మెల్లగా అతని వ్యవహరిస్తున్న తీరు మాట్లాడే విధానంపై నాకు అనుమానం వచ్చింది. ఇంట్లో ఉన్న స్పెషల్ గదికి తీసుకెళ్లి కొంత అసభ్యంగా మాట్లాడాడు.

బ్లూ ఫిల్మ్ చూపించాడు
తన గదిలోనే ఒక బ్లూ ఫిల్మ్ చూపించే ప్రయత్నం చేశాడు. అలాగే తన దగ్గరకు ఏ హీరోయిన్ వచ్చినా కూడా ఈ గదిలోకె ఎంజాయ్ చేస్తుంటారని ఆ దర్శకుడు చెప్పేవాడు. అతని పద్ధతిపై అప్పుడు నాకు చాలా కోపంగా అనిపించింది. వెంటనే నాకు ఆరోగ్యం అంతగా బాగోలేదనే సాకుతో అక్కడి నుంచి తప్పించుకున్నాను. మరోసారి అతనిని కలవలేదు.. అని పాయల్ వివరణ ఇచ్చింది.
Recommended Video

సుశాంత్ సింగ్ పిరికివాడు కాదు
ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి మాట్లాడిన పాయల్.. అతను నాకు చాలా మంచి స్నేహితుడిని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపింది. ఇక డ్రగ్స్ తీసుకుంటే చలాకీగా ఉంటారనేది పూర్తిగా అవాస్తవమని, డ్రగ్స్ వాడకం మంచిది కాదని ఈ బ్యూటీ తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. ఇక గతంలో ఒక క్రికెటర్ తో బ్రేకప్ తనను ఎంతగానో బాధించినట్లు పాయల్ తెలిపింది.


Click it and Unblock the Notifications











