ఐశ్వర్యా రాయ్‌ని కూడా వదిలి పెట్టలేదు.. కంగనాకు మద్దతుగా పాయల్ స్ట్రాంగ్ కౌంటర్
సుశాంత్ సింగ్ మరణంపై, వాస్తవాలను బయట పెట్టాలని పోరాడుతోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఈ క్రమంలో మొదటి నుంచి బాలీవుడ్ మాఫియా, నెపోటిజం, సినీ పెద్దల కుట్రలను వివరిస్తూనే ఉంది. తాజాగా ఓ జాతీయ మీడియాతో ముచ్చటిస్తూ.. కంగనా సంచలన కామెంట్స్ చేసింది. మహేష్ భట్, కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా, రాజీవ్ మసాంద్ వంటి వారిని ఏకిపారేసింది. మధ్యలో తాప్సీ, స్వర భాస్కర్ పేర్లను ప్రస్థావించడంతో టాపిక్ మొత్తం డైవర్ట్ అయింది.

బీ గ్రేడ్ యాక్టర్స్..
బాలీవుడ్ మాఫియా, నెపోటిజం వల్లే అలియా, అనన్య కంటే ఎంతో టాలెంట్ ఉన్న తాప్సీ, స్వర భాస్కర్ వంటి వారు బీ గ్రేడ్ యాక్టర్స్‌గా ఉంటున్నారని కంగనా పేర్కొంది. అక్కడ కంగనా వారిద్దరి గురించి గొప్పగానే చెప్పినా వాడిన పదం మాత్రం అభ్యంతరకరంగానే ఉంది. తనను బీ గ్రేడ్ అనడంపై తాప్సీ కౌంటర్స్ వేయసాగింది.

తాప్సీ కౌంటర్స్..
తనను బీ గ్రేడ్ యాక్టర్స్ అనడంపై తాప్సీ స్పందిస్తూ.. చిన్నతనంలో ఇలా పరీక్షల్లో గ్రేడ్‌లు ఇచ్చేవారని తెలుసు కానీ బాలీవుడ్‌లోనూ ఇస్తారని తనకు తెలీదంటూ కౌంటర్స్ వేసింది. అంతే కాకుండా తమ స్థాయి, తమ సంపాదన పట్ల కొందరు బాగానే ఆసక్తి చూపిస్తున్నారంటూ సెటైర్స్ వేసింది. చాలా మంది తాప్సీ సెటైర్లను మద్దతిస్తూ కంగనాను ట్రోల్ చేస్తున్నారు.

మద్దతిచ్చిన పాయల్..
కంగనాపై ట్రోల్స్ చేసే వారిపై పాయల్ ఘోష్ ఫైర్ అవుతూ.. సోఫాలో కూర్చుని, కాఫీ తాగుతూ ఎదుటి వారి గురించి చెడ్డగా మాట్లాడటం ఈజీయేనని చెప్పుకొచ్చింది. కానీ కంగనాను అందరూ కలిసి ఇలా టార్గెట్ చేయడం చూస్తుంటేనే బాలీవుడ్ అంటే ఏంటి? అందులోని మనుషులు ఎలాంటి వారో అర్థమవుతోందని ఫైర్ అయింది.
Recommended Video

ఐశ్వర్యా రాయ్‌నే వదల్లేదు..
పాయల్ ఘోష్ మరో ట్వీట్ చేస్తూ.. ‘అందగత్తె, ప్రతిభా వంతురాలైన నటి అయిన ఐశ్వర్యా రాయ్‌నే ట్రోల్ చేశారు. ఆమె ఫ్యాషన్ సెన్స్, మిగతా వ్యక్తిగత విషయాలపై బాలీవుడ్ సెలెబ్రిటీ లు ట్రోల్స్ చేశారు. ఆ సమయంలో అంతా ఎక్కడి వెళ్లారు. ఏ ఒక్కరూ బయటకు వచ్చి మాట్లాడలేదు.. ఎందుకంటే వారు పెద్ద ఫ్యామిలీకి చెందిన వారు కాబట్టి. కానీ కంగనాను మాత్రం ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











