twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్‌ది హత్యే.. ఆధారాలు బయటపెట్టిన పాయల్ ఘోష్

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రియా చక్రవర్తికి ఉచ్చు బిగుస్తోన్నట్టు కనిపిస్తోంది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముంబై పోలీసుల కంటే వంద రెట్ల వేగంతో కేసును పరిశోధిస్తున్నారు. అయితే ముంబై పోలీసులు సహకరించడం లేదని బీహార్ డీజీపీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా సుశాంత్ తండ్రి బీహార్ సీఎంతో మాట్లాడినట్టు తెలుస్తోంది.

     సీబీజీకి అప్పగించాలని..

    సీబీజీకి అప్పగించాలని..

    సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని బీహార్ సీఎం నితీష్ కుమార్‌ను కేకే సింగ్ కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫోన్ ద్వారా సీఎంతో కేకే సింగ్ మాట్లాడారు. అయితే ఈ విషయంలో సీఎం కూడా సుముఖంగానే ఉన్నట్టు, సీబీఐకి అప్పగించాలని కోరినట్టు తెలుస్తోంది.

     ముంబై పోలీసులపై..

    ముంబై పోలీసులపై..

    సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్‌ను తన ట్వీట్లతో ఏకిపారేస్తోంది పాయల్ ఘోష్. తాజాగా ఆమె ముంబై పోలీసులపై సెటైర్ వేసింది. ‘ముంబై పోలీసులు ఎంతో గొప్పవారని, వారిపట్ల ఎప్పుడూ గర్వంగా ఫీలవుతానని, వారి గురించి కోల్‌కత్తాలోని ఫ్యామిలీతో నిత్యం వాదించేదాన్ని. ఇండియాలోనే బెస్ట్ అని ఫైట్ చేసేదాన్ని. ఎంత రాత్రిపూట అయినా నిర్భయంగా తిరిగేంత రక్షణ ఇస్తారని చెప్పేదాన్ని. అయితే ఇప్పుడు మాత్రం అలా గొప్పగా చెప్పలేనేమో..

     అది హత్యే..

    అది హత్యే..

    ఒకవేళ రియా అమాయకురాలే అయితే.. బీహార్ పోలీసులను చూసి ఎందుకు పారిపోతుంది. సుశాంత్ బైపోలార్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని చనిపోయిన నెల తరువాత అతని సైక్రియార్టిస్ట్ ఎందుకు అలా చెప్పింది.. పోస్ట్ మార్టం చేసిన వీడియో ఎలా మిస్ అవుతుంది? దయచేసి అదెలా జరుగుతుందో చెప్పండి.. నాకు జ్ఞానోదయం కలిగించండి..లేదంటే వీటన్నంటిని బట్టి చూస్తే సుశాంత్‌ది హత్య అని, మిగతాదేదీ కాదని అర్థం చేసుకోవచ్చు.

    Recommended Video

    Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
    నిద్రలోనే సుఖమైన చావు..

    నిద్రలోనే సుఖమైన చావు..

    బాధ లేని చావు గురించి ఆలోచించిన వారు.. తనది తాను ఉరి ఎలా వేసుకుంటారు. ఒక వేళ సుశాంత్ డిప్రెషన్‌కు వెళ్లి ఉంటే.. మందులు వాడి ఉంటే.. వాటినే ఎక్కువ మోతాదులో తీసుకుంటే నిద్రలోనే సుఖమైన చావు వచ్చేది కదా' అంటూ పాయల్ ఘోష్ చేసిన ట్వీట్స్ సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.

    English summary
    Payal Ghosh Tweet On Mumbai Police About Sushant Singh Case. If Rhea is so innocent dn WYshe absconding as soon as Biharpolice arrived.Whypsychiatrists of itsSSR realised he ws bipolar aftr almst a mnth of hisdeath& hw cld a postmortem file get deleted.pls enlighten me.Nw I’m rest assured dtSushant ws murdered& nthg else.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X