సుశాంత్ మరణం వెనుకున్న కోణాలివే.. అందరూ కలిసి ఎలా చంపారో చూపించిన పాయల్
సుశాంత్ సింగ్ మరణం వెనుకున్న కోణాలు ఎవ్వరికీ తెలియడం లేదు. ఎవరికి తోచినట్టుగా వారే ఊహించేసుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్దమో తెలియడమే లేదు. అయితే సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్య అని కొందరు నమ్ముతుంటే.. అది కచ్చితంగా హత్యేనని మరికొందరు బలంగా నమ్ముతున్నారు.
Recommended Video
సుశాంత్ మరణ వార్త తెలిసినప్పటి నుంచి బాలీవుడ్, నెపోటిజం, కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ వంటి వారిపై సోషల్ మీడియాలో నిత్యం ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. అయితే నేడు మాత్రం ఈ వ్యవహారం మొత్తం ఓ మలుపు తిరిగింది. ఇదే జరిగి ఉంటుందని ఓ కథనం సోషల్ మీడయాలో చక్కర్లు కొడుతోంది. ఆ స్టోరీని పాయల్ రాజ్‌పుత్ షేర్ చేయడంతో అది మరింత వైరల్ అయింది.

సుశాంత్ మరణం..
సుశాంత్ సింగ్ జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదట్లో డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని అంతా అనుకున్నా రోజులు గడుస్తున్న కొద్దీ రోజుకో చర్చ బయటకు వస్తోంది. సుశాంత్ మరణం వెనుక బాలీవుడ్ మాఫియా, నెపోటిజం, కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, మహేష్ భట్, రియా చక్రవర్తి వంటి వారున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే నేడు మరో యంగ్ హీరోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సూరజ్ పంచోరిపై ఫైర్..
హీరో సూరజ్ పంచోరిపై నెటిజన్లు మండి పడుతున్నారు. నాడు జియా ఖాన్‌ను అలాగే చంపాడని, నేడు సుశాంత్ సింగ్ మేనేజర్ దిశా సలియాన్‌ను అలాగే చంపాడని ఆరోపిస్తున్నారు. సూరజ్, దిశాల మధ్య జరిగిన గొడవలు, ఆపై ఆమె మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో సుశాంత్ తన మేనేజర్ దిశాకు సాయం చేసేందుకు సిద్దపడ్డాడని, అందుకు సుశాంత్‌ను అడ్డు తొలిగించుకునేందుకు అందరూ కలిసి హత్య చేశారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు ఓ కథనం కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా పాయల్ కూడా అదే కథనాన్ని షేర్ చేసింది.

పాయల్ పోస్ట్ వైరల్..
పాయల్ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా వేసిన ఆర్ట్‌ను షేర్ చేస్తూ ఆ బాధ ఎప్పటికీ ఉంటుందని భోరున ఏడుస్తున్న ఏమోజీని షేర్ చేసింది. అంతే కాకుండా సుశాంత్ అభిమానులందరూ సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని కోరుతున్నారని చెబుతూ.. పాయల్ కూడా సీబీఐ ఎంక్వైరీకి మద్దతు తెలిపింది.

సుశాంత్ ఆర్ట్ వైరల్..
నేటి ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నకథనాలను కూడా పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఓ అభిమాని వేసిన ఆర్ట్‌ను కూడా షేర్ చేసింది. సుశాంత్‌ను అందరూ కలిసి అలా చంపి ఉంటారని వేసిన ఓ ఆర్ట్ చిత్రాన్ని పాయల్ రాజ్‌పుత్ షేర్ చేయగా అది తెగ వైరల్ అవుతోంది.

బ్రేక్ ది సైలెన్స్..
ఘటన జరిగి 18 రోజులు అవుతున్నా ఇంకా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు బ్రేక్ ది సైలెన్స్ (#BreakTheSilenceForSushant)అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆర్ట్ మాత్రం అందరి గుండెల్ని పిండేస్తోంది. బెడ్‌పై సుశాంత్ పడుకుని ఉన్నట్టు.. ఎవరో ఇద్దరూ అతడిని చంపేస్తున్నట్టుగా ఉన్న ఆర్ట్ అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.


Click it and Unblock the Notifications











