సుశాంత్ డెత్: సల్మాన్‌తో సరసాలు ఆడుతున్నవా?.. కత్రినా కైఫ్ సైలెన్స్ పై పాయల్ ఆగ్రహం
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి కారణం తెలియాలని బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయం చెబుతున్నారు. అయితే కొంతమంది బడా స్టార్స్ మాత్రం ఈ విషయంపై సైలెంట్ గా ఉండడం కొందరికి నచ్చడం లేదు. ముఖ్యంగా కంగనా రనౌత్ ఇప్పటికే నెపోటిజమ్ వ్యవహారంతో కొందరికి కౌంటర్ ఇచ్చేసింది. ఇక ఇప్పుడు కత్రినాకైఫ్ సైలెన్స్ పై మరో బ్యూటీ కాంట్రవర్సీ కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారింది.

ఎలాంటి వివధాలు చోటు చేసుకున్నా..
ఆ బ్యూటీ మరెవరో కాదు. బాలీవుడ్ లో కాంట్రవర్సీ టాపిక్స్ తో నిత్యం మీడియా దృష్టిని ఆకర్షించే పాయల్ రోహాట్గి. బాలీవుడ్ లో ఎలాంటి వివధాలు చోటు చేసుకున్నా కూడా అంధరికంటే ముందుగా ఈ బ్యూటీ మరో కొత్త వివాదం తలెత్తేలా మాట్లాడుతుంది. ఒక విదంగా ఆమె చేసిన సినిమాల కంటే కూడా కాంట్రవర్సీలే ఆమెకు మంచి క్రేజ్ అందించాయి.

కంగనాకు పోటీగా పాయల్
2002నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న పాయల్ రోహాట్గి 2008లో బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆ తరువాత చాలా రియాలిటీ షోలలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఘటనపై రెగ్యులర్ స్పందిస్తూ.. కంగనాకు పోటీగా నిలుస్తున్న పాయల్ ఇటీవల కత్రినా కైఫ్ పై ఊహించని విధంగా కామెంట్స్ చేసింది.

కత్రినా సైలెన్స్ కి కౌంటర్
సుశాంత్ చనిపోయిన రోజు మాత్రమే స్పందించిన కత్రినా ఆ తరువాత జారుగుతున్న ఘటనలపై పెద్దగా స్పందించ లేదు. దీంతో ఆమెపై పాయల్ సెరైరికల్ కామెంట్స్ చేసింది. కంగనా స్టైల్ లో ఆమె ఒక బి- గ్రేడ్ విదేశీ యాక్టర్ అంటూ సల్మాన్ వంటి వాళ్లతోనే రొమాన్స్ చేస్తుందని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒక రోజు సల్మాన్ అంటుంది. మరో రోజు వేరేవాళ్లను అంటుంది. నిజంగా ఆమె తీరేంటో అర్థం కాదని తన స్టైల్ లో పాయల్ కౌంటర్ ఇచ్చింది.
Recommended Video

కత్రినా ఏ విధంగా స్పందిస్తుందో
ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై స్పందించాడానికి నేను ఏమీ బాలీవుడ్ హీరోయిన్ ని కాదు, అలాగే అతనితో ఒక సినిమా కూడా చేయలేదు. అలాంటప్పుడు సుశాంత్ పై ఎలా స్పందిస్తాను అంటూ కత్రినా చెబుతున్నట్లు పాయల్ ఇమిటేట్ చేసిన విధానం వైరల్ గా మారింది. కంగనా కంటే హై రేంజ్ లో పాయల్ కత్రినా కైఫ్ కు కౌంటర్ ఇచ్చిందని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ కామెంట్స్ పై కత్రినా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











