కంగనా హీరోయిన్ అని సినిమానే వదిలేశాడట.. టాప్ సినిమాటోగ్రఫర్ చర్యకు అంతా షాక్

ఓ హీరోనో, హీరోయినో, దర్శకుడో, నిర్మాతో ఇలా చిత్రంలో ఎవరో ఒకరు నచ్చలేదని ఇంకెవరో ఒకరు తప్పుకునే సందర్భాలుంటాయి. మరో సందర్భంలో.. ఎవరు ఎవరికి నచ్చకున్నా.. సినిమా కోసం కలిసి పని చేసే సందర్భాలుంటాయి. అయితే తాజాగా ఇండియన్ టాప్ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ కంగనా రనౌత్ పట్ల ఉన్న విద్వేషాన్ని, ద్వేషాన్ని బయటపెట్టాడు. అయితే పీసీ శ్రీరామ్ చర్యను కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కంగనా రనౌత్ పేరు మార్మోగిపోతోంది. సుశాంత్ సింగ్ కేసు, బాలీవుడ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌తో గొడవ ఇలా కంగనా ప్రతీ విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో కొందరు కంగనాకు మద్దతు తెలుపుతుండగా.. ఇంకొందరు శవాలపై పేలాలు ఏరుకునే టైప్ అంటూ సెటైర్ వేస్తున్నారు. ఏది ఏమైనా కంగనా ప్రస్తుతం చేస్తున్న చర్యలపై పీసీ శ్రీరామ్ విముఖత వ్యక్తం చేస్తోన్నట్టు అనిపిస్తోంది.

PC Sreeram Had to reject a film as it had Kangana Ranaut as the lead

కంగనా చేస్తోన్న చర్యలకు నచ్చకనే ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలిపాడు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. కంగనా మెయిన్ లీడ్ అయినందుకు ఓ సినిమాను వదులుకున్నాను. నా పరిస్థితిని మేకర్స్‌కు చెప్పాను వారు అర్థం చేసుకున్నారు.

ఒక్కోసారి మనం ఏది ఫీల్ అయితామే అదే రైట్.. వారికి శుభం కలగాలి అంటూ సదరు మూవీ యూనిట్‌కు విషెస్ తెలిపాడు. ఇక పీసీ శ్రీరామ్ చేసిన ఈ ట్వీట్‌కు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్స్. అటెన్షన్ సీకర్, నిన్ను కూడా అలానే ఎవరైనా చేస్తే తెలుస్తుందని కౌంటర్లు వేస్తున్నారు. చాలా మంచి పనిచేశావని, ఆమె సౌత్ టెక్నీషియన్స్‌కు గౌరవం ఇవ్వదని, సినిమా వదులుకోవడమే ఉత్తమమని సలహాలు ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X