Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అక్కడ అట్టర్ ప్లాప్ దిశగా విజయ్ దేవరకొండ సినిమా!
Recommended Video
విజయ్ దేవర కొండ, రీతూ వర్మ జంటగా నటించిన పెళ్లి చూపులు చిత్రం చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. డెబ్యూ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. పెళ్లి చూపులు చిత్రం జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రాన్ని హిందీలో మిత్రోన్ పేరుతో రీమేక్ చేశారు. కార్తీక, జాకీ భగ్నానీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
క్రిటిక్స్‌ని మెప్పించలేక
మిత్రోన్ చిత్రం సినీ విమర్శకులని, ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. తొలి షో నుంచే నెగిటివ్ టాక్ మొదలైంది. రివ్యూలు కూడా ఆశాజనకంగా లేవు. దీనితో మిత్రోన్ చిత్రం పరాజయం దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
దారుణంగా వసూళ్లు
తొలి షోనుంచే ఈ చిత్రానికి పూర్తిగా నెగిటివ్ టాక్ వ్యాపించింది. దీనితో తొలి రోజు దేశవ్యాప్తంగా ఈ చిత్రం 50 లక్షల వసూళ్లు మాత్రమే సాధించింది. రెండవ రోజు నుంచి కలక్షన్లను పూర్తిగా తగ్గు ముఖం పట్టినట్లు తెలుస్తోంది.
మ్యాజిక్ చేశాడు
తెలుగులో తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చిత్రంతో మ్యాజిక్ చేశాడు. దానికి తోడు ఆకతాయి కుర్రాడిగా విజయ్ దేవరకొండ నటన, రీతూ వర్మ పెర్ఫామెన్స్ ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి. ఇక కమెడియన్ ప్రియదర్శి హాస్య సన్నివేశాలు మంచి వినోదాన్ని అందించాయి.
ఉపయోగించుకోలేక
పెళ్లి చూపులు చిత్రంలో ఉన్నా పాజిటివ్ అంశాలని ఉపయోగించుకోవడంతో హిందీ వెర్షన్ దర్శకుడు నితిన్ కక్కర్ పూర్తిగా విఫలం చెందినట్లు తెలుస్తోంది. మొత్తగా పెళ్లి చూపులు హిందీ రీమేక్ ప్రయోగం బెడిసి కొట్టింది.