వివాదంలో పెళ్లి చూపులు హిందీ రీమేక్!
విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు చిత్రం అతడికి కెరీర్ లో తొలి హిట్ గా నిలిచింది. యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పెళ్లి చూపులు చిత్రానికి జాతీయ అవార్డు సైతం దక్కింది. తెలుగులో ఘన విజయం సాధించడంతో పెళ్లి చూపులు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు.
హిందీలో ఈ చిత్రాన్ని మిత్రోన్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. తెలుగువర్షన్ నే అదేవిధంగా ఫాలో అయిపోయారు. కానీ టైటిల్స్ విషయంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ కు అన్యాయం జరిగిందనే వివాదం మొదలైంది. తరుణ్ భాస్కర్ కథతో రీమేక్ చేస్తున్నారు కాబట్టి టైటిల్స్ లో అతడి పేరు వేయాలి. కానీ తరుణ్ భాస్కర్ పేరు కనిపించలేదు.

తరుణ్ భాస్కర్ కు క్రెడిట్ ఇవ్వకుంటే తప్పు చేసినట్లే అని అంటున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు. కనీసం సినిమా విడుదలయ్యాక అయినా టైటిల్స్ లో తరుణ్ భాస్కర్ పేరు వేస్తారో లేదో చూడాలి. మిత్రోన్ చిత్రాన్ని దర్శకుడు నితిన్ కక్కర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జాకీ భగ్నానీ, కృతిక కర్మ జంటగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











