ఆడవాళ్ళ మధ్య శృంగారం, ప్రేమ.. కాలం మారింది కాబట్టి ఒప్పుకోవాలి.. రెజీనా!

అందాల తార రెజీనా ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టింది. రెజీనా, సోనమ్ కపూర్ కలసి నటించిన 'ఏక్ లడకికో దేఖా తో ఐసా లగా' చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సినీ విమర్శకుల నుంచి మంచి రివ్యూలు వస్తున్నాయి. లెస్బియన్ సెక్స్, లవ్ నేపథ్యంలో మహిళా దర్శకురాలు షెల్లీ చోప్రా ధార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సోనమ్ కపూర్, రెజీనా ఈ చిత్రంలో ప్రేమికులుగా కనిపిస్తారు. వింతగా ఉన్న ఈ చిత్రం గురించి రెజీనా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

సెక్షన్ 377

సెక్షన్ 377

ఈ చిత్రం సెన్సిటివ్ సబ్జెక్ట్ తో కూడుకున్నది. ఆడియన్స్ ని ఎలా కన్విన్స్ చేయబోతున్నారు అనే ప్రశ్నకు రెజీనా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఎన్నో చూస్తున్నాం. ప్రజలు క్రమంగా అన్ని విషయాలని అంగీకరిస్తున్నారు. సెక్షన్ 377పై కూడా తీర్పు వచ్చింది. ఇలాంటి తరుణంలో ఈ చిత్రానికి ఇబ్బందులు ఉంటాయని నేను అనుకోను. ప్రజలు ఫ్రెండ్లీగా ఆలోచిస్తున్నారు అని రెజీనా తెలిపింది.

ఆడవాళ్ళ మధ్య ప్రేమ

ఆడవాళ్ళ మధ్య ప్రేమ

ప్రేమకు వివిధ రూపాలు ఉన్నాయి. కట్టుబాట్లు అనే పదంతో ప్రేమని అడ్డుకోవడం వీలు కాదు. ప్రేమ అంటే ఇలానే ఉండాలి అనే కట్టుబాట్లు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాడు. లెస్బియన్ సెక్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం. ప్రజల్లో ఈ విషయాల గురించి క్రమంగా అవగాహన పెరుగుతోంది అని రెజీనా తెలిపింది. కాలంలో మార్పు వస్తోంది కాబట్టి ఇలాంటి వాటిని ఒప్పుకోవాలి అని రెజీన తెలిపింది.

మరిన్ని చిత్రాలు చేస్తా

మరిన్ని చిత్రాలు చేస్తా

నేనెంటో నిరూపించుకునే అవకాశం బాలీవుడ్ లో ఈ చిత్రం ద్వారా దక్కింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడ అవకాశాలు వచ్చినా చేస్తా. కానీ ప్రస్తుతం బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెడతా అని రెజీనా తెలిపింది. నేను సౌత్ ఇండియన్ నటిని మాత్రమే అని అనిపించుకోవడం ఇష్టం లేదు. ఆ ఇమేజ్ ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నా అని రెజీనా తెలిపింది.

అందాలు ఆరబోసినా

అందాలు ఆరబోసినా

రెజీనా ఇటీవల సౌత్ లో అందాలు ఆరబోసి నటించింది. కానీ రెజినాకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీనితో ఈ భామ బాలీవుడ్ అవకాశాల వైపు చూస్తోంది. ఏక్ లడకికో దేఖా తో ఐసా లగా చిత్రం రెజినాకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి. రారా కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానంద లాంటి తెలుగుచిత్రల్లో రెజీనా నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X