గణేష్ చతుర్థి 2019: సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన కత్రినా, అలియా, ఇలియానా, మాధురి దీక్షిత్
భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబైలోని అంబానీల నివాసం అంటిలియాలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి అంబానీ కుటుంబంలో జరుగుతున్న గణేష్ చతుర్థి వేడుకలు ప్రత్యేకమనే చెప్పాలి. ముఖేష్-నీతా అంబానీ కుమారుడు, కూతురు వివాహం జరిగిన తర్వాత వచ్చిన తొలి గణేష్ ఫెస్టివల్ కావడంతో మరింత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, జయా బచ్చన్, కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, అలియా భట్, మాధురి దీక్షిత్, ఇలియానా, కరిష్మా కపూర్ తదితరులు హాజరై సందడి చేశారు.

అంబానీ ఇంట జరిగే వేడుకలో బచ్చన్ కుటుంబం
బిగ్ బి అమితాబ్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ ముగ్గురూ కలిసి అంబానీ ఇంట జరుగుతున్న గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొనడానికి వస్తున్న దృశ్యం. అయితే అమితాబ్ కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్య ఇక్కడ కనిపించలేదు.

రణబీర్ కపూర్, అలియా భట్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్, రణబీర్ కపూర్‌కు కూడా అంబానీ ఇంట జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు ఆహ్వానం అందింది. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మస్త్ర'లో కలిసి నటిస్తున్న ఈ ప్రేమ పక్షులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరై అందరి దృష్టినీ ఆకర్షించారు.

సోదరితో కలిసి కత్రిన కైఫ్
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తన సోదరి ఇసబెల్ల కైఫ్‌తో కలిసి గణేష్ చతుర్థి వేడుకలకు హాజరయ్యారు. కత్రినా వారసత్వంతో ఇసబెల్లా త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సూరజ్ పంచోళితో కలిసి ఆమె ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కరిష్మా కపూర్ స్టన్నింగ్ లుక్
కరిష్మా కపూర్ ఎరుపురంగు చీరలో గణేష్ చతుర్థి వేడుకలకు హాజరైన అందరూ స్టన్నయ్యేలా చేశారు. ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన కరిష్మా కపూర్.... ఇప్పటికీ తనలో ఏ మాత్రం గ్లామర్ తగ్గకుండా అందాన్ని మెయింటేన్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు.

భర్తతో కలిసి మాధురి దీక్షిత్
ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తన భర్త శ్రీరామ్ మాధవ్‌తో కలిసి అంబానీ ఇంట జరిగిన గణేష్ చతుర్థి వేడులకు హాజయ్యారు. ఈ జంటను చూసిన అభిమానులు వీరిని లవ్లీ కపుల్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.

విద్యా బాలన్
విద్యా బాలన్ తన భర్త, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో కలిసి అంబానీ ఇంట జరిగిన వేడుకకు హాజరయ్యారు. విద్యా బాలన్ నటించిన ‘మిషన్ మంగళ్' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకోవడంతో ఆమె మరింత సంతోషంగా గణేష్ చతుర్థి వేడుక జరుపుకున్నారు.

ఇలియానా...
తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయినట్లు ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచిన ఇలియానా.... అంబానీ ఇంట జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు ఒంటరిగా హాజరయ్యారు. లావెండర్ కలర్ లెహంగా ధరించిన ఆమె అందరి దృష్టినీ ఆకర్షించారు.


Click it and Unblock the Notifications











