twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ వెడ్డింగ్ రిసెప్షన్లో ప్రధాన నరేంద్ర మోడీ సందడి!

    |

    Recommended Video

    PM Modi Posts Pic With Priyanka Chopra And Nick Jonas, Wishes Them 'Happy Married Life' | Filmibeat

    ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ వెడ్డింగ్ రిసెప్షన్లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సందడి చేశారు. ఈ నూతన దంపతులకు విషెస్ తెలిపేందుకు ఢిల్లీలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు. ప్రధాన మంత్రి హాజరైన విషయాన్ని తెలియజేస్తూ ప్రియాంక చోప్రా కొన్ని ఫోటోస్ అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

    ప్రియాంక, నిక్ పెళ్లి వేడుకకు హాజరై వెళ్లిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సైతం సోషల్ మీడియా ద్వారా విష్ చేశారు. వారితో కలిసి దిగిన ఫోటోను సైతం ఆయన షేర్ చేయడం గమనార్హం.

    ప్రియాంక, నిక్ దంపతులతో మోడీ

    ‘కంగ్రాజ్యులేషన్స్ ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్.... విష్ యూ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అంటూ ప్రధాని మోడీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నవదంపతులు ఆశ్వీర్వదించారు. మెడీ షేర్ చేసిన ఈ ఫోటోకు కొన్ని గంటల్లోనో 1.5 మిలియన్ లైక్స్ రావడం విశేషం

    మోడీకి కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక

    గౌరవరీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ స్వయంగా హాజరైన మమ్మల్ని ఆశీర్వదించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ రాక మమ్మల్ని ఎంతో ఆనందానికి గురి చేసింది అంటూ ప్రియాంక రిప్లై ఇచ్చారు.

     ప్రియాంక-నిక్ జొనాస్

    ప్రియాంక-నిక్ జొనాస్

    ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ వివాహం డిసెంబర్ 1, 2 తేదీల్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. మొదటి రోజు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం, రెండో రోజు హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక జరిగింది.

    బాలీవుడ్ రిసెప్షన్ త్వరలో

    బాలీవుడ్ రిసెప్షన్ త్వరలో

    ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ దంపతులు బాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ముంబైలో మరో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

    అమెరికాలో కాపురం

    అమెరికాలో కాపురం

    పెళ్లి తర్వాత ప్రియాంక-నిక్ దంపతులు అమెరికాలో కాపురం పెట్టబోతున్నారు. ఆమె తీరు చూస్తుంటే బాలీవుడ్ కంటే హాలీవుడ్ కెరీర్ మీదనే ప్రియాంక ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ చిత్రాల్లో ఈ బ్యూటీని ఇకపై అరుదుగా మాత్రమే చూడబోతున్నామనేది వాస్తవం.

    English summary
    Actor Priyanka Chopra on Wednesday expressed her gratitude to Prime Minister Narendra Modi for wishing her a "happy married life". The prime minister, who attended Priyanka and American singer Nick Jonas' wedding reception on Tuesday, congratulated the couple on Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X