23 భాషల్లో బయోపిక్.. సినీ చరిత్రలోనే సంచలనం..
Recommended Video

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బయోపిక్‌ల హవా కొనసాగుతున్నది. హిందీలో ధోని, మిల్కా సింగ్, మేరికోమ్ లాంటి ప్రముఖుల జీవిత కథతో వచ్చిన బయోపిక్స్ ప్రేక్షకుల ఆదరణ పెరిగాయి. తాజాగా బాలీవుడ్‌లో ప్రధాని నరేంద్రమోదీ పేరుతో మరో బయోపిక్‌కు విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీ జీవితకథతో రానున్న బయోపిక్‌లో వివేక్ ఒబేరాయ్ టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి వివరాల్లోకి వెళితే..

ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో
మేరికోమ్, సరబ్‌జిత్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఒమంగ్ కుమార్ ఈ చిత్రానికి డైరెక్టర్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రిలీజ్ చేశారు. దేశభక్తి నా శక్తి, బలం అనే థీమ్‌తో విడుదలైన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

లోక్‌సభ ఎన్నికల సమయంలో
ప్రధాని నరేంద్రమోదీ జీవిత కథతో వస్తున్న బయోపిక్‌ను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ చిత్రాన్ని 23 భాషల్లో విడుదల చేయడం విశేషంగా మారింది. ఇప్పటి వరకు ఇన్ని భాషల్లో ఓ బయోపిక్ వచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.

థాక్రే, మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా
ప్రస్తుత ఏడాదిలోనే టైగర్ బాల థాక్రే జీవితం ఆధారంగా సినిమా రావడం, అదే సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లైఫ్ హిస్టరీతో చిత్రం తెరకెక్కడం చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనే నరేంద్రమోదీ జీవితం కూడా సినిమాగా రావడంతో బయోపిక్స్ అంశం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వేడెక్కనున్న రాజకీయ వాతావరణం
రానున్న లోక్‌సభ ఎన్నికల వల్ల వేడేక్కే రాజకీయ వాతావరణానికి బయోపిక్ అంశం కూడా తోడైంది. రాజకీపరంగా కొన్ని వర్గాలు తమకు నచ్చిన, తమ పార్టీకి సంబంధమున్న నేతల జీవిత కథలను విస్తృతంగా ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. రానున్న రోజుల్లో సినిమా పరిశ్రమ చుట్టే రాజకీయం తిరగడం ప్రత్యేక ఆకర్షణగా మారబోతున్నది.


Click it and Unblock the Notifications











