twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పిఎం నరేంద్ర మోడీ’ ట్రైలర్: ఒక ఛాయ్ వాలా ప్రధాని అవుతాడా?

    |

    భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా ఓమంగ్ కుమార్ దర్శకత్వంలో బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఒబెరాయ్ మోడీ పాత్ర పోషిస్తున్న ఈచిత్రం 'పిఎం నరేంద్ర మోడీ' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వివేక్ ఒబెరాయ్ మెడీ మాదిరిగా డ్రెస్ వేసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు.

    ఒక మామూలు ఛాయ్ వాలా.. దేశ ప్రధాని అవుతాడా? అంటూ మొదలైన ఈ ట్రైలర్లో నరేంద్ర మోడీ బాల్యం నుంచి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు జరిగిన జర్నీలోని ముఖ్యమైన ఘట్టాలను ఫోకస్ చేశారు. ఉగ్రవాదులను చూసి భారత దేశం భయపడకూడదు, భారత దేశాన్ని చూసి ఉగ్రవాదులు భయపడాలి... పాకిస్థాన్‌కు నేను వార్నింగ్ వార్నింగ్ ఇస్తా... అంటూ వివేక్ ఒబెరాయ్ చెప్పిన డైలాగులు ట్రైలర్లో హైలెట్ అయ్యాయి.

     PM Narendra Modi biopic trailer out

    ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వివేక్ ఒబెరాయ్‌తో పాటు దర్శన్ కుమార్, బోమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహెబ్, బర్ఖా బిస్త్ సేన్ గుప్తా, అంజన్ శ్రీవాస్తవ్, యతిన్ కార్యేకర్, రాజేంద్ర గుప్తా, అక్షత్ ఆర్ సలుజా, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    PM Narendra Modi biopic trailer out, directed by Omung Kumar, it shows Vivek Oberoi struggling to play the Indian Prime Minister. PM Narendra Modi to release on 12 April 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X