twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పీఎం నరేంద్ర మోదీ బయోపిక్: గాయపడ్డ వివేక్ ఒబెరాయ్

    |

    పీఎం నరేంద్ర మెదీ బయోపిక్‌లో టైటిల్ రోల్ చేస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్... షూటింగులో గాయపడ్డారు. ఉత్తరఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా హర్షిల్ వ్యాలీలో చిత్రీకరణ జరుగుతుండగా శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

    మోడీ ప్రధానమంత్రి కాకముందు అతడి జీవితంలో జరిగిన సంఘటనలు చిత్రీకరించడంలో భాగంగా ఇక్కడి గంగా ఘాట్, కల్ప్ కేదార్ మందిర్, సస్పెన్షన్ బ్రిడ్జ్, ధారాలి బజార్, ముక్భా గ్రామంలో షూటింగ్ జరుగుతోంది.

    PM Narendra Modi biopic: Vivek Oberoi hurt, resumes shooting

    ధారాలి విలేజ్ సమీపంలోని గంగా ఘాట్ వద్దకు మోదీ పాదరక్షలు లేకుండా నడిచి వెళ్లిన సన్నివేశాలు చిత్రీకిస్తుండగా వివేక్ ఒబెరాయ్ గాయపడ్డారు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాలికి కట్టె ముక్క కోసుకుపోవడంతో గాయమై భారీగా రక్తస్రావం కావడంతో వైద్యులు కుట్లు వేశారు. అయితే ప్రమాదం ఏమీ లేదని, ప్రస్తతం వివేక్ ఒబెరాయ్ కోలుకున్నారని, షూటింగ్ మళ్లీ ప్రారంభించినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

    ధారాలి బజార్లో వేసిన ప్రత్యేకమైన సెట్లో... బీజేపీ కార్యకర్తలతో కలిసి నరేంద్రమోదీ ర్యాలీగా వెళ్లి శ్రీనగర్‌లోని లాల్ చౌక్ ప్రాంతంలో జాతీయ జెండాను ఎగురవేసిన సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. గతంలో బాలీవుడ్లో మేరీ కోమ్, సరబ్జీత్ లాంటి బయోపిక్స్ తెరకెక్కించిన ఓమంగ్ కుమార్ మోదీ బయోపిక్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Actor Vivek Oberoi on Saturday hurt himself while shooting for the biopic on Prime Minister Narendra Modi in the picturesque Harshil valley of Uttarkashi district in Uttarakhand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X