అమ్మాయి కనిపిస్తే టచ్ చేయకుండా.. ప్రధానిపై సెటైర్లు.. పరిణితి ఝలక్.. మీడియాలో రచ్చ!
ప్రధాని నరేంద్రమోదీని బాలీవుడ్ నటి పరిణితి చోప్రా కలుసుకొనే వెసలుబాటు ఇటీవల కలిగింది. జనవరి 19న ముంబైలో దేశపు తొలి నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాను ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని షేక్ హ్యాండ్ ఇవ్వగా పరిణితి రెండు చేతులు ఎత్తి నమస్కరించింది. ఇటీవల ఆ ఫోటోను పరిణితి తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా విచిత్రమైన, వినోదపూరితమైన కామెంట్లు పోటెత్తాయి. నెటిజన్లు ఎలా స్పందించారంటే..

పరిణితి చోప్రా పోస్ట్ చేసిన ఫొటోలో
పరిణితి పోస్ట్ చేసిన ఫొటోలో ప్రధాని చేయి చాపి ఆమె చేయి కోసం వేచి చూసినట్టు కనిపించింది. ఇంకా ఈ ఫొటోలో రోహిత్ శెట్టి, ర్యాపర్ బాద్షా, కార్తీక్ ఆర్యన్ తదితరులు ఉన్నారు. ఈ ఫొటోను ఉద్దేశించి మోదీ ప్రయత్నాలు బూడిదలో కలిశాయి అని నెటిజన్లు రకరకాలా కామెంట్లతో మెమెలతో రఫ్ ఆడించారు.

పరిణితికి ఇంత చెడ్డ రోజులా?
పరిణితికి ఇంత చెడ్డరోజులు వచ్చాయా? ప్రధాని మోదీలాంటి వ్యక్తితో షేక్ హ్యాండా? అంటూ, అలాగే మోదీ తెలివైన ప్రధాని.. యంగ్ లేడీస్ కనిపిస్తే టచ్ చేయకుండా వదలరు. ఇతరులతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాపే తొలి ప్రధాని ఇతనే అంటూ సెటైర్లు వదిలారు.

సినిమాకు ఆ శక్తి
ఇదిలా ఉండగా, ఫిల్మ్ మ్యూజియం ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ.. సినిమాకు నిశ్శబ్ద విప్లవం సృష్టించే శక్తి ఉంది. సమాజంలో మార్పులకు, ప్రజల ఆలోచన తీరును మార్చే శక్తి సినిమాలకు ఉంది అని ప్రధాని మోదీ అన్నారు.

సినిమా పరిశ్రమ అభివృద్ధికి
దేశంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. వినోదరంగానికి ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. పైరసీపై ఉక్కుపాదం మోపేందుకు సర్కార్ ప్లాన్ సిద్ధం చేసింది. భవిష్యత్ అంతా డిజిటల్, సోషల్ మీడియాదే హవా అని ప్రధాని మోదీ అన్నారు.

ప్రధానితో సినీ ప్రముఖులు
ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో మనోజ్ కుమార్, అమీర్ ఖాన్, ఏఆర్ రెహ్మన్, ఆశాభోంస్లే, రణ్‌ధీర్ కపూర్, కరణ్ జోహర్, మధుర్ బండార్కర్, బోనికపూర్, రాకేష్ ఓం ప్రకాశ్ మిశ్రా, పరిణితి చోప్రా, దివ్య దత్తా తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











