డ్రగ్స్ కేసులో హీరోయిన్ అరెస్ట్.. కుక్కతో సూపర్ ట్విస్ట్.. సినిమాను మించి రివేంజ్ డ్రామా!

బాలీవుడ్ నటి క్రిసన్ పెరీరాను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్ క్రిసాన్ పెరీరాను రెండు వారాల కింద దుబాయ్ లోని షార్జాలో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తుందన్న ఆరోపణలోతో పోలీసులు అదుపోలోకి తీసుకున్నారు. ప్రస్తుతం షార్జా సెంట్రల్ జైల్లో క్రిసన్ పెరీరా ఉండగా ఆమెను కావాలనే కేసులో ఇరికించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే తాజాగా ఈ కేసులో ఊహించని విధంగా కొత్త ట్విస్ట్ ఎదురైంది.

హింసిస్తున్నారు:బాట్లా హౌజ్, సడక్ 2, థింకిస్తాన్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ క్రిసన్ పెరీరా. ఆమెను ఏప్రిల్ 1న మాదక ద్రవ్యాల కేసులో దుబాయ్ లో షార్జా విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వారాలుగు ఆమె షార్జా సెంట్రల్ జైల్లో ఉంటోంది. అయితే ఆమెను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని, జైల్లో ఆమెను ఇబ్బందులు, హింసకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Police Arrest 2 Men In Actress Chrisann Pereira All Drugs Case Over Planting Drugs On Her

బేకరీ వ్యక్తి:అయితే తాజాగా క్రిసన్ పెరీరా కేసులో సరికొత్త కోణం ఎదురుచూసింది. నటిని కావాలని ఇరికించిన ఇద్దరిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన అంథోని పాల్ నటి క్రిసాన్ కు షార్జాకు టికెట్ బుక్ చేశాడు. కానీ రిటర్న్ టికెట్ మాత్రం బుక్ చేయలేదని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి దీపక్ సావంత్ వెల్లడించారు. అయితే నటి క్రిసాన్ పెరీరాను కావాలనే ఇరికించేందుకు బేకరీ నడిపే వ్యక్తి అయిన ఆంథోని బ్యాంక్ అసిస్టెంట్ మేనెజర్ అయిన రాజేష్ బొభతే సాయం తీసుకున్నాడు.

ఆడిషన్ కోసం:ఆంథోని పాల్ ప్లాన్ ప్రకారం నటీనటులను ఎంపిక చేసే కన్సలెంట్ గా పరిచయం చేసుకున్న రాజేష్ నటి క్రిసన్ ను కలిశాడు. ఒక వెబ్ సిరీస్ కోసం షార్జాలో ఆడిషన్ ఉన్నట్లుగా చెప్పాడు. దీంతో అందులో ఆడిషన్ ఇచ్చేందుకు నటి ఒప్పుకుంది. ఆడిషన్ కోసం వెళ్లో రోజు ముంబై విమానాశ్రయానికి పక్కనే ఉన్న కాఫీ షాపులో తనను కలవాల్సిందిగా క్రిసాన్ ను కోరాడు రాజేష్. దీంతో ఆమె రాజేష్ ను కలిసేందుకు వెళ్లింది.

Police Arrest 2 Men In Actress Chrisann Pereira All Drugs Case Over Planting Drugs On Her

తల్లిపై ప్రతీకారంగా:కాఫీ షాపులో ఆడిషన్ లో భాగంగా ఒక ట్రోఫీని క్రిసన్ కు రాజేష్ ఇచ్చాడు. అది స్క్రిప్ట్ లో భాగమని చెప్పుకొచ్చాడు. అయితే అందులో గంజాయితోపాటు విత్తనాలు దాచి ఉంచాడు రాజేష్. ఆ ట్రోఫీతో నటి క్రిసన్ దుబాయ్ కు చేరుకుంది. అప్పుడు షార్జా ఎయిర్ పోర్ట్ పోలీసులకు నిందుతులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా నటి తల్లిపై ప్రతీకారం తీర్చుకునేందుకే అని పోలీసులు కనిపెట్టారు.

Police Arrest 2 Men In Actress Chrisann Pereira All Drugs Case Over Planting Drugs On Her

కుర్చీతో కొట్టేందుకు:ముంబైలోని మలాడ్, బోరివలి ప్రాంతంలో ఆంథోని పాల్ బేకరీ నడుపుతుంటాడు. హీరోయిన్ క్రిసన్ తల్లి ప్రమీలా పెరీరా నివసించే భవనంలోనే పాల్ సోదరి కూడా ఉంటోంది. అయితే ఒక పెంపుడు కుక్క విషయంలో హీరోయిన్ తల్లి, పాల్ సోదరికి గొడవ జరిగింది. తర్వాత కొద్దిరోజులకు సోదరి చూసేందుకని ఆంథోని వెళ్లగా అక్కడు ఉన్న కుక్క అతనిపై మొరిగింది. దీంతో అతను కుర్చీతో కొట్టే ప్రయత్నం చేశాడు. అది చూసిన ప్రమీలా అందరి ముందే అతనిపై అరిచింది.

Police Arrest 2 Men In Actress Chrisann Pereira All Drugs Case Over Planting Drugs On Her

అవమానించిదని..:ప్రమీలా పెరీరా అతన్ని అవమానించదన్న కారణంతోనే తన కూతురు నటి క్రిసన్ పెరీరాను కావాలని గంజాయి కేసులో ఆంథోని ఇరికించినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విషయంలో రాజేష్ నెంబర్ ప్రమీలాకు వచ్చింది. తన కూతురు సినిమాల్లో నటిస్తుందని రాజేష్ కు ప్రమీలా చెప్పడంతో.. తనకు టాలెంట్ మెనేజ్ మెంట్ కంపెనీలు ఉన్నట్లు, ఆమెకు అవకాశం కల్పిస్తానని చెప్పాడు రాజేష్. ఇలా స్టార్ట్ చేసి నటి క్రిసsన్ పెరీరాను కేసులో ఇరికించారని పోలీసులు పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X