For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రముఖ హీరోయిన్‌పై కేసు నమోదు.. కారణం ఆమె వేసుకున్న బట్టలే.!

  By Manoj
  |

  వాణీ కపూర్.. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరును సంపాదించుకున్న నటి. బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తొలి సినిమాలోనే అద్భుతమైన నటనను కనబరిచి ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. అయినప్పటికీ అమ్మడికి అవకాశాలు పెద్దగా రాలేదు. ఆరు సంవత్సరాల సినీ కెరీర్‌లో ఈమె కేవలం నాలుగంటే నాలుగు సినిమాలను మాత్రమే చేసింది. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచినవే. దీంతో ఆమె ఎంతో గుర్తింపును దక్కించుకుంది. అయితే, ఇటీవల ఆమె ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా అది కాస్తా ముదిరిపోయింది.

   సోషల్ మీడియాలో యమ యాక్టివ్

  సోషల్ మీడియాలో యమ యాక్టివ్

  బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు ఉన్న ఆమె తరచూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు, వ్యక్తిగత వివరాలను కూడా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. దీంతో వాణీని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

   రీసెంట్‌గా సూపర్ హిట్ కొట్టింది

  రీసెంట్‌గా సూపర్ హిట్ కొట్టింది

  వాణీ కపూర్ తాజాగా ఓ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన చిత్రం ‘వార్'. ఈ సినిమాను యస్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. యాక్షన్ జోనర్‌గా వస్తున్న ‘వార్'ను సిద్దార్ద్ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా వాణీ కపూర్ నటించింది. ఇటీవల విడుదలైన ‘వార్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

  క్లీవేజ్ షోతో హాట్ టాపిక్

  క్లీవేజ్ షోతో హాట్ టాపిక్

  వాణీ కపూర్ తరచూ ఎక్స్‌పోజింగ్‌తో కూడిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆమె క్లీవేజ్‌ షో చేసిన ఓ ఫొటో షూట్ చేసింది. వాటి తాలూకు ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలతో కనువిందు చేసింది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి.

   ఎదపై ఆ పేరు.. చెలరేగిన వివాదం

  ఎదపై ఆ పేరు.. చెలరేగిన వివాదం

  వాణీ కపూర్ క్లీవేజ్ చేసిన ఫొటోల వల్ల ఓ వివాదం చెలరేగింది. ఈ ఫొటోల్లో ఆమె లేత గులాబీ రంగు బ్లౌజ్ ధరించింది. దానిపై హిందువులు ఎంతో పవిత్రంగా కొలుచుకునే శ్రీరాముడి పేరు రాసి ఉంది. ఈ విషయంలో ఆలస్యంగా బయటకు వచ్చింది. దీంతో వివాదం చెలరేగింది. వాణీ కపూర్ చేసిన పనికి హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కారణంగా ఇది హాట్ టాపిక్ అవుతోంది.

  హీరోయిన్‌పై కేసు నమోదు

  హీరోయిన్‌పై కేసు నమోదు

  ఈ బాలీవుడ్ హీరోయిన్ వేసుకున్న బ్లౌజ్ కారణంగా ముంబైకి చెందిన ఒక వ్యక్తి ఎమ్ ఎన్ జోషి మార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘బ్లౌజ్ హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించి, హీరోయిన్‌పై కేసు నమోదు చేశారు.

  Title : #CineBox : #SarileruNeekevvaruTeaser | #OMGDaddy Song | Ragala 24 Gantallo Movie Review
  తెలుగులో నానితో సినిమా

  తెలుగులో నానితో సినిమా

  వాణీ కపూర్ తెలుగులోనూ ఓ సినిమా చేసింది. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘ఆహా కల్యాణం'లో ఆమె లీడ్ రోల్ పోషించింది. ఇందులో ఆమె నటన ఆకట్టుకుంది. అలాగే, ఈ సినిమాలో నాని - వాణీ మధ్య వచ్చే కిస్ సీన్స్‌ చూసి తెలుగు ప్రేక్షకులు అవాక్కైపోయారు. ఆ తర్వాత ఆమె మరోసారి టాలీవుడ్‌లో కనిపించలేదు. సెలెక్టెడ్‌గా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.

  English summary
  Vaani recently posted a picture where she could be seen wearing a blouse top along with khaki coloured trousers. The white blouse which had frills on the sides and was the deep neck, had Lord Rama’s name printed all over it in pink.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X