For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దిశా - టైగర్: రోడ్డుపైనే కారులో అలా.. కేసు నమోదు చేసిన పోలీసులు

  |

  మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే... బాలీవుడ్‌లో ప్రేమాయణాలు.. డేటింగులు.. బ్రేకప్‌లు.. ప్రేమ వివాహాలు వంటివి సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే. అక్కడ ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఇలా పలు వ్యవహారాల వల్ల దేశ వ్యాప్తంగా హైలైట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోన్న వారిలో దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ జంట ఒకటి. చాలా రోజులుగా రచ్చ రచ్చ చేస్తోన్న ఈ జోడీ.. తాజాగా ఓ పని చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీంతో పోలీసులు వీళ్లపై కేసు నమోదు చేశారు. ఆ సంగతులు మీకోసం!

  దిశా పటానీ కెరీర్ అలా మొదలైంది

  దిశా పటానీ కెరీర్ అలా మొదలైంది

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. తక్కువ సమయంలోనే ఫేమస్ అయిపోయింది దిశా పటానీ. ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో తన అందచందాలతో ఆకట్టుకున్న ఆమె.. యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. కానీ, సినిమా ఆడలేదు. దీని తర్వాత ఆమె నేరుగా బాలీవుడ్‌లోకే అడుగు పెట్టేసిందీ బ్యూటీ.

  తెలుగు మూవీ రీమేక్‌తో టైగర్ ష్రాఫ్

  తెలుగు మూవీ రీమేక్‌తో టైగర్ ష్రాఫ్

  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పరుగు'. ఈ సినిమా హిందీ రీమేక్ ‘హీరోపంటి' ద్వారా టైగర్ ష్రాఫ్ బాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో డీసెంట్‌గా కనిపించిన అతడు.. ఆ వెంటనే యాక్షన్ సినిమాల్లో నటించాడు. ఫలితంగా అదిరిపోయే ఫిజిక్‌తో యాక్షన్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. తద్వారా స్టార్‌గా ఎదిగిపోయాడు.

  వరుస చిత్రాలతో ఫుల్ బిజీ.. స్టార్లుగా

  వరుస చిత్రాలతో ఫుల్ బిజీ.. స్టార్లుగా

  అటు దిశా పటానీ.. ఇటు టైగర్ ష్రాఫ్ ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరో, హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. ఈ క్రమంలోనే వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. అలాగే, ఒకదాని తర్వాత ఒకటి ఇలా జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం దక్కించుకున్నారు.

  జంటగా మారిపోయిన దిశా - టైగర్

  జంటగా మారిపోయిన దిశా - టైగర్

  దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ ‘భాగీ 2' అనే సినిమాలో జంటగా నటించారు. ఆ మూవీ కోసం పని చేస్తోన్న సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడిపోయారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఈ జంట రహస్యంగా తమ ప్రేమను కొనసాగించింది. ఇలా పలుమార్లు కెమెరా కంటికి చిక్కినప్పటికీ.. ప్రేమలో ఉన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో ఈ జంటపై పుకార్లు షికార్లు చేశాయి.

  జంటగా రచ్చ.. రెచ్చిపోయి ఎంజాయ్

  జంటగా రచ్చ.. రెచ్చిపోయి ఎంజాయ్

  చాలా కాలంగా దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీళ్లపై ఎన్నో కథనాలు వెలువడ్డాయి. దీంతో పలుమార్లు దీని గురించి వీళ్లకు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఇలాంటి సమయంలోనే తమ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఇక, అప్పటి నుంచి రెచ్చిపోయి రచ్చ చేస్తున్నారు. దీంతో నిత్యం వార్తల్లోనే నిలుస్తున్నారు.

  రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దిశా - టైగర్

  రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దిశా - టైగర్

  కరోనా విజృంభిస్తోన్న సమయంలో మాల్దీవులు టూర్ వెళ్లి విమర్శలను ఎదుర్కొన్నారు దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్. దీంతో అక్కడి నుంచి ఇండియాకు వచ్చేశారు. ఇక, నిత్యం లంచ్‌కో డిన్నర్‌కో కలిసి వెళ్తుండే వీళ్లిద్దరూ.. లాక్‌డౌన్‌లో దూరంగా ఉంటున్నారు. ఇలా బోర్ కొట్టిందో ఏమో.. తాజాగా మరోసారి కలిసి దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ ముంబైలో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

  Seeti Maar From Radhe Released - Allu Arjun Reacts | Filmibeat Telugu
  రోడ్డుపైనే కారులో వెళ్లి.. కేసు నమోదు

  రోడ్డుపైనే కారులో వెళ్లి.. కేసు నమోదు

  ప్రస్తుతం ముంబైలో ఉదయం 7 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకూ లాక్‌డౌన్ నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ కారులో ప్రయాణిస్తూ పోలీసులకు దొరికిపోయారు. దీంతో కరోనా నిబంధనలు ఉల్లంగించినందుకు గానూ నగర పోలీసులు ఈ సినీ జంటపై ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

  English summary
  Bollywood Star Couple Disha Patani and Tiger Shroff Violation of COVID-19 Restrictions in Mumbai. Then City Police Register a Case on This Couple with section 188.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X