సుశాంత్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ కాంట్రాక్ట్.. వివరాలు అడిగిన పోలీసులు..అన్ని కోణాల్లో లోతుగా విచారణ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన అందరికీ ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. సుశాంత్ మరణించి వారం అవుతున్నా సరే.. ఇంకా ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్‌కు న్యాయం జరగాలని, విచారణ జరిపించాలని అందరూ కోరుతున్నారు. సీబీఐ ఎంక్వైరీ వేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. సుశాంత్ మృతికి బాలీవుడ్, నెపోటిజం, కొందరు పెద్దలే కారణమని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

Recommended Video

Sushant Singh Rajput: Paani సహా 7 Movies నుంచి ప్లాన్ ప్రకారం Sushant ని తొలగించారు
బాలీవుడ్‌పై ఫైర్..

బాలీవుడ్‌పై ఫైర్..

డిప్రెషన్‌కు గురైన సుశాంత్ గత ఆదివారం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్ మరణానికి బాలీవుడ్‌లోని మాఫియానే కారణమని ఆరోపించారు. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, ఆదిత్య చోప్రా, ఏక్తా కపూర్ వంటి వారేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వీరందరిపైన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

నెపోటిజంపై స్పందన..

నెపోటిజంపై స్పందన..

బాలీవుడ్‌లో పాతుకుపోయిన నెపోటిజంపై బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం స్పందించారు. వివేక్ ఒబేరాయ్, కంగనా రనౌత్, సోను నిగమ్, దబండ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ వంటి వారు బాలీవుడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఎవరి క్రెడిట్ వారికి ఇవ్వండని, ప్రతిభను ప్రోత్సహించండని, కొత్తవారికి అవకాశాలు ఇవ్వండని కోరారు.

అన్ని కోణాల్లో..

అన్ని కోణాల్లో..

ముంబై పోలీసులు సుశాంత్ మృతిపై అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకే సుశాంత్‌తో కాంట్రాక్ట్ చేసుకున్న సంస్థలన్నింటిపైనా కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో యష్ రాజ్ ఫిల్మ్స్‌ను కొన్ని పత్రాలు సమర్పించవలసిందని కోరారు.

YRF కాంట్రాక్ట్ కాపీలు..

YRF కాంట్రాక్ట్ కాపీలు..

సుశాంత్ ఏడు నెలల్లో ఆరు ప్రాజెక్ట్‌లు కోల్పోయాడని వచ్చినా ఆరోపణలను పోలీసులు పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే యష్ రాజ్ ఫిల్మ్స్‌‌కు సంబంధించిన కాంట్రాక్ట్ కాపీలు సమర్పించవలిసిందని పోలీసులు కోరారు. మూడు సినిమాలు చేయాలని కాంట్రాక్ట్ ఉండి కూడా రెండు ప్రాజెక్ట్‌లు చేశారని తెలుస్తోంది. ఇక మూడోప్రాజెక్ట్‌కు ఆలస్యం చేయడంతో పలు చిత్రాలను వదులుకున్నాడని సమాచారం. మరి పోలీసుల విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X