For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ క్షణంలో నెర్వెస్‌గా ఫీలై.. వద్దనుకొన్నాం.. ఇక ఆలస్యం చేయ్యెద్దని కమిట్ అయ్యాం!

|

బాలీవుడ్ తారలు పూజా బాత్రా, నవాబ్ షా మరోసారి వార్తల్లో సంచలనంగా మారారు. గత కొద్దినెలలుగా మీడియాను కుదిపేస్తున్న ముదురు ప్రేమికులు పూజా బాత్రా, నవాబ్ షా హాట్ హాట్ ఫొటోలతో టాప్ లేపేస్తున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న వీరిద్దరూ జూలై 4న దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ప్లేస్‌లో పెళ్లి చేసుకొన్నారు. వీరిద్దరికి కూడా రెండో వివాహం కావడం గమనార్హం. త్వరలోనే వారిద్దరూ అధికారంగా తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకోనున్నారు. తన పెళ్లి అనంతరం పూజా బాత్రా మాట్లాడుతూ..

మేమిద్దరం పెళ్లి చేసుకొన్నాం..

మేమిద్దరం పెళ్లి చేసుకొన్నాం..

నవాబ్‌తో పెళ్లి నిజమే. ఢిల్లీలో ప్రైవేట్‌ కార్యక్రమంగా జరిగిన వేడుకలో మేమిద్దరి పెళ్లి చేసుకొన్నాం. మా పెళ్లికి కేవలం ఇరు కుటుంబాలు మాత్రమే హాజరయ్యారు. మా మధ్య అఫైర్ సాగుతున్న సమయంలో నవాబ్ తప్ప మరొకరు నా జీవిత భాగస్వామి కాలేరనిపించింది. ఇక ఆలస్యం చేయడం ఇష్టం లేక ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకొన్నాం. ఇక ఆగడం వల్ల ప్రయోజనం లేదనే నిర్ణయానికి వచ్చాం అని పూజా బాత్రా అన్నారు.

బాగా రీ కనెక్ట్ అయ్యాం

బాగా రీ కనెక్ట్ అయ్యాం

మేమిద్దరం ఒకే ప్రొఫెషనల్‌లో ఉండటం వల్ల మా మధ్య అవగాహన చక్కగా కుదిరింది. ఈ మధ్య ఫిబ్రవరిలో కామ్ ఫ్రెండ్ ద్వారా కలిశాం. అప్పటి నుంచి మేము చక్కగా కలిసిపోయాం. మా జీవితంలో కొన్ని ఒడిదుకుల మధ్య సరైన సమయంలో ఒకరికొకరం బాగా రీ కనెక్ట్ అయ్యాం. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటంతో మరింత దగ్గరయ్యాం అని పూజా బాత్రా పేర్కొన్నారు.

మా మధ్య మానసిక పరిపక్వతతో

మా మధ్య మానసిక పరిపక్వతతో

మా ఇద్దరి మధ్య మానసిక పరిపక్వతతో కూడిన బంధం ఏర్పడింది. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. నవాబ్‌లో కుటుంబ పరమైన లక్షణాలు నన్ను బాగా ఆకట్టుకొన్నాయి. మా మధ్య స్నేహం కంటే మరేదో బంధం ఉందని గ్రహించాం. అందుకే పెళ్లికి నిర్ణయం తీసుకొన్నాం అని పూజా బాత్రా వెల్లడించారు.

అలా ప్రపోజ్ చేయాలని..

అలా ప్రపోజ్ చేయాలని..

నవాబ్ ఓ ఎయిర్‌పోర్టులో నాకు ప్రపోజ్ చేయాలనుకొన్నాడు. కానీ ఎందుకో నెర్వస్‌గా ఫీలై, ఆ ఆలోచనను మానుకొన్నాడు. ఆ తర్వాత తరచూ కలుసుకొంటూ ఉంటున్న సమయంలో ఓ రోజు ఢిల్లీలో ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత నా తల్లిదండ్రులకు, ఆయన పేరెంట్స్‌కు తెలియజేసి అంగీకారం తీసుకొన్నాం అని పూజా బాత్రా అన్నారు.

English summary
Bollywood heroine Pooja Batra given clarity about her marriage with Nawab shah. She said "Yes, we are married. Nawab and I exchanged vows in Delhi, with only our families in attendance. Our loved ones kept asking us why we were delaying.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more