రహస్యంగా పెళ్లి... అసలు విషయం ఒప్పుకున్న హీరోయిన్, ఏం జరిగిందంటే?

బాలీవుడ్ నటి పూజా బాత్రా పెళ్లి గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నటుడు, తన ప్రియుడు నవాబ్ షాను ఆమె రహస్యంగా పెళ్లాడినట్లుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై పూజా స్పందించారు. తమ పెళ్లి జరిగిన మాట నిజమే అని ఒప్పుకున్నారు.

ముంబైకి చెందిన ఓ ఆంగ్లపత్రికతో పూజా మాట్లాడుతూ... జులై 4న ఢిల్లీలో తమ వివాహం జరిగిందని, ఈ వేడుక పూర్తి ప్రైవేట్ కార్యక్రమంలా జరిగిందని, కేవలం తమ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరయినట్లు ఆమె స్పష్టం చేశారు.

ఆర్య సమాజ్ వివాహం

ఆర్య సమాజ్ వివాహం

మేము ఎప్పటి నుంచో మంచి స్నేహితులుగా ఉన్నాం. అయితే పెళ్లి విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మమ్మల్ని ప్రేమించేవారంతా అడగటం మొదలు పెట్టారు. నా మిగతా జీవితం మొత్తం నేను కలిసి గడిపే ఏకైన మగాడు అతడే అని నిర్ణయించుకున్నాక ఆలస్యం చేయడం ఎందుకు? అనిపించింది, వెంటనే ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నాం. ఈ వారం మా పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలి... అని పూజా చెప్పుకొచ్చారు.

అలా విషయం లీక్ అయింది

అలా విషయం లీక్ అయింది

పూజా బాత్రా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఓ వీడియో కారణంగా వీరి పెళ్లి విషయం బయటకు లీకైంది. ఆ వీడియోలో ఆమె ‘చూడా' అనే సాంప్రదాయ గాజులు ధరించారు. అవి కేవలం కొత్తగా పెళ్లయిన వారు మాత్రమే ధరిస్తారు.

అలా ఇద్దరం రీ కనెక్ట్ అయ్యాం

అలా ఇద్దరం రీ కనెక్ట్ అయ్యాం

తన భర్త గురించి వెల్లడిస్తూ... ‘కామన్ ఫ్రెండ్ ద్వారా మేము మళ్లీ ఫిబ్రవరిలో పరిచయం అయ్యాం. అప్పటి నుంచి స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయిపోయాం. మా జీవితంలో మేము సరైన సమయంలో రీ కనెక్ట్ అయినట్లు అనిపించింది. ఎమోషనల్‌‌గా ఇద్దరం ఒకే మూడ్లో ఉన్నాం. మా మనసులు, ఆలోచనలు కలిశాయి. మేము ఒకరికొకరం ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ఆయన పూర్తి ఫ్యామిలీ పర్సన్' అని తెలిపారు.

ఢిల్లీలో ప్రపోజ్ చేశాడు

ఢిల్లీలో ప్రపోజ్ చేశాడు

నన్ను కలిసిన వెంటనే నవాబ్ నాకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు. చివరకు ఢిల్లీలో ప్రపోజ్ చేశాడు. తర్వాత ఆయన తన పేరెంట్స్‌తో వచ్చి మా తల్లిదండ్రులను కలిశారు. అందరికీ ఓకే కావడంతో మా పెళ్లికి రంగం సిద్ధమైందని పూజా చెప్పుకొచ్చారు.

పూజా బాత్రా మొదటి వివాహం

పూజా బాత్రా మొదటి వివాహం

పూజా బాత్రా మొదటి వివాహం... యూఎస్ బేస్డ్ డాక్టర్‌తో జరిగిన సంగతి తెలిసింది. అయితే ఇద్దరూ ఎంతో కాలం కలిసి జీవించలేక పోయారు. విడాకులు తీసుకున్నారు. అది తన హ్యాపీ మ్యారేజ్ కాదని, ఆ సమయంలో చాలా కష్టమైన పరిస్థితులు ఫేస్ చేశాను, విదేశంలో ఒంటరిగా మిగిలిపోయాను గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X