twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకొన్న నాగార్జున హీరోయిన్.. యాక్టర్‌తో సహజీవనానికి గుడ్‌బై

    |

    బాలీవుడ్ నటి పూజా బాత్రా అఫైర్ మరోసారి వార్తల్లో ప్రముఖంగా మారింది. ఆమె రొమాంటిక్ జీవితం ఇప్పటికే ముంబై మీడియాను ఊర్రూతలూగించింది. గత కొద్దికాలంగా నవాబ్ షా అనే ప్రముఖుడితో డేటింగ్ చేస్తున్న ఈ నడి వయసు ముద్దుగుమ్మ రెండో పెళ్లి కూడా చేసుకొన్నారనే వార్త బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా మారింది. గత కొద్దికాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ తమ బంధానికి అధికార ముద్ర వేశారు. వివరాల్లోకి వెళితే..

    సీక్రెట్‌గా పూజా బాత్రా పెళ్లి

    సీక్రెట్‌గా పూజా బాత్రా పెళ్లి

    ముంబై మీడియా తెలిపిన ప్రకారం.. పూజా బాత్రా, నవాబ్ షా ఇద్దరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్నారు. వీరి వివాహం సంప్రదాయబద్దంగా జరిగింది. పెళ్లికి చట్టబద్దత కల్పించడానికి వారు త్వరలోనే తమ వివాహాన్ని రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌లో నమోదు చేసుకోవాలనుకొంటున్నారు. లేటు వయసులో నవదంపతులుగా మారిన పూజా బాత్రా, నవాబ్ ప్రస్తుతం శ్రీనగర్‌లో ఉన్నారు. నవాబ్ చెల్లిలి పెళ్లికి వారు హాజరవ్వడమే కాకుండా హానీమూన్‌ను కూడా కానిచ్చేస్తున్నారు అని పేర్కొన్నది.

    ఇన్సాటాగ్రామ్‌లో హింట్ ఇచ్చి

    ఇన్సాటాగ్రామ్‌లో హింట్ ఇచ్చి

    తమ మ్యారేజ్ గురించి పూజా బాత్రా ఇన్స్‌టాగ్రామ్‌లో హింట్ ఇచ్చింది. పంజాబీ పెళ్లికూతురిలా సంప్రదాయ దుస్తులు ధరించిన ఫొటోను పోస్ట్ చేసింది. దాంతో ఆమె పెళ్లి వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో ఈ అమ్మడి పెళ్లి ప్రకటన కోసం మీడియా ఆతృతగా ఎదురుచూస్తున్నది.

     గతంలో ఎన్నారై డాక్టర్‌తో పెళ్లి

    గతంలో ఎన్నారై డాక్టర్‌తో పెళ్లి

    గతంలో పూజా బాత్రా వివాహం అమెరికాకు చెందిన డాక్టర్ సోనూ అహ్లువాలియాతో జరిగింది. 2003లో జరిగిన పెళ్లి తర్వాత ఆమె లాస్ ఎంజెలెస్‌లో కాపురం పెట్టింది. అనంతరం వారిద్దరి మధ్య విభేదాలు నెలకొనడంతో పరస్పర అవగాహనతో విడాకులు తీసుకొన్నారు. అప్పటి నుంచి యాక్టర్ నవాబ్ షాతో డేటింగ్ చేస్తూ సహజీవనం సాగిస్తున్నది. పూజాతో రిలేషన్‌ను ఇటీవలే నవాబ్ షా సోషల్ మీడియాలో వెల్లడించారు.

    నాగార్జునతో గెస్ట్‌గా పూజా బాత్రా

    నాగార్జునతో గెస్ట్‌గా పూజా బాత్రా

    ఇక పూజా బాత్రా కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో నాగార్జున సరసన సిసింద్రీ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించింది. అలాగే దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన గ్రీకువీరుడు చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. హిందీలో భాయ్, విరాసత్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక నవాబ్ షా భాగ్ మిల్కా భాగ్, దిల్‌వాలే, టైగర్ జిందా హై చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించే దంబంగ్ 3 చిత్రంలో నటిస్తున్నాడు.

    English summary
    Pooja Batra got marriage with actor Nawab Shah news made bollywood media alert. Reports suggest that, Pooja and Nawab have tied the knot in a traditional ceremony, “They have yet to register the marriage but it will happen soon. Their family and close friends are happy for them. They were in Srinagar recently for Nawab’s sister’s wedding”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X