‘మా నాన్నకు మూడు విడాకులు.. నాలుగు పెళ్లిళ్లు.. అందుకే డైవోర్స్ తీసుకొన్నా..’
బాలీవుడ్ నటి పూజా బేడి తాజాగా తన వ్యక్తిగత, కుటుంబ విషయాలపై సంచలన విషయాలను వెల్లడించింది. పర్సనల్, ఫ్యామిలీ సంబంధాలపై ఎవరూ ఊహించని విషయాలను మీడియాతో పంచుకొన్నారు. తన విడాకులు, కొత్త వైవాహిక బంధంపై పలు విషయాలను వెల్లడించారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...

విడాకులు తీసుకోవద్దని...
ఫర్హాన్ ఫర్నీచర్ వాలాతో నాకు అలాయా ఎఫ్, ఓమర్ ఇద్దరు సంతానం. వైవాహిక జీవితాన్ని ఎన్నో విభేదాలు, అసంతృప్తులతో నెట్టుకొచ్చాను. ఇద్దరు పిల్లలు పెరిగి పెద్ద అవుతున్న సమయంలో నేను నా భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాను కానీ నా స్నేహితులు, సన్నిహితులు అలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు అని పూజా బేడీ చెప్పారు.

నా భర్తతో విడాకుల విషయంలో
రాజీ పడినా జీవితం నిలబడుతుందనే ఆశ లేనప్పుడు నేను విడాకులు తీసుకోవాలనే డిసైడ్ అయ్యాను. ఫర్హాన్‌తో విడాకులు తీసుకోవడానికి నేను వెనుకంజ వేయలేదు. సమాజంలో విడాకుల తీసుకొన్న మహిళలకు ఎదురయ్యే సమస్యలను పట్టించుకోలేదు అని పూజా బేడీ తెలిపారు.

చాలా మంది బెదిరించారు..
నా జీవితంలో ఊహించని విధంగా 18 ఏళ్ల క్రితం విడాకులు తీసుకొన్నప్పుడు నా కుటుంబ సభ్యులు నిన్ను ఎవరు పెళ్లి చేసుకొంటారని ప్రశ్నించారు. నీ పిల్లల గురించి ఆలోచించు. నీ లైఫ్ గురించే ఎందుకు ఆలోచిస్తున్నావు. నీ పిల్లల భవిష్యత్ ఏమౌతుందో బాగా ఆలోచించు అనే సలహాలు ఇచ్చారు అని పూజా బేడీ అన్నారు.

మా నాన్న కబీర్ బేడీ నాలుగు పెళ్లిళ్లతో
అయితే అప్పుడు అనేక ప్రశ్నలకు నేను మా నాన్న కబీర్ బేడీ లైఫ్‌ను ఎగ్జాంపుల్‌గా తీసుకొన్నాను. ఆయన మూడుసార్లు విడాకులు తీసుకొని.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొన్నారనే విషయాన్ని ప్రస్తావించాను. నా జీవితంలో విడాకులు అనే పదం నాకు కొత్త కాదు. విడాకులు తీసుకొన్న కుటుంబంలో బతికి పెరిగాను. విడాకుల తర్వాత ప్రేమను గెలుచుకొన్న వ్యక్తులను నా కుటుంబంలో చూశాను అని పూజా బేడీ తెలిపారు.
Recommended Video

పూజా బేడీతో మానెక్ కాంట్రాక్టర్ నిశ్చితార్థం
తన భర్త ఫర్హాన్ ఫర్నీచర్‌వాలాతో విడాకుల తర్వాత ప్రస్తుతం మానెక్ కాంట్రాక్టర్‌తో ఎంగేజ్‌మెంట్ అయింది. ప్రస్తుతం వారిద్దరూ గోవాలో ఉంటున్నారు. ఇటీవల పూజా బేడీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తాజా ఇంటర్వూ కూడా మీడియాలో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











