పొలిటికల్ లెజెండ్ మనవడితో స్టార్ హీరోయిన్ కూతురు డేటింగ్.. రెడ్ హ్యాండెడ్‌గా దుబాయ్‌లో మీడియాకు చిక్కిన జంట..

అలనాటి బాలీవుడ్ శృంగార తార, ప్రముఖ నటుడు కబీర్ బేడి కుమార్తె పూజాబేడి ఇటీవల కాలంలో మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నారు. తన రెండో వివాహ నిశ్చితార్తం, మొదటి భర్తతో విడాకులు గురించి తాజా ఇంటర్యూ వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, పూజా బేడి కుతురు అలయా ఎఫ్ ప్రస్తుతం మహారాష్ట్రలోని ప్రముఖ రాజకీయ నేత మనవడితో డేటింగ్ చేయడం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో పూజాబేడీ, ఆమె కూతురు అలయా వివరాల్లోకి వెళితే..

18 ఏళ్ల క్రితం విడాకులతో పూజా బేడీ

18 ఏళ్ల క్రితం విడాకులతో పూజా బేడీ

పూజా బేడీ తన మొదటి భర్త ఫర్హాన్ ఫర్నీచర్‌వాలాతో 18 ఏళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు. అయితే తన తల్లి ఒంటరిగా జీవించడం ఇష్టం లేని కూతురు అలయా మరో పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త మానెక్ కాంట్రాక్టర్‌తో మ్యారేజ్ నిశ్చితార్థం చేసుకొన్నారు. అయితే కరోనావైరస్ కారణంగా వారిద్దరి పెళ్లి వాయిదా పడింది. ప్రస్తుతం వారిద్దరూ గోవాలో సహజీవనం చేస్తున్నారు. ఇటీవల పూజా బేడీ షేర్ చేసిన వారిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాల్ థాక్రే మనవడితో అఫైర్

బాల్ థాక్రే మనవడితో అఫైర్

ఇక తల్లి పూజా బేడీ వ్యవహారాలు ఇలా ఉంటే.. కూతురు అలయా డేటింగ్ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అలయాకు శివసేన అధినేత, దివంగత బాల్ థాక్రే మనవడితో చనువుగా ఉంటున్నది. వారిద్దరు కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరగడంపై బాలీవుడ్‌లో అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఆ కథనాలకు బలం చేకూరే మాదిరిగానే వారిద్దరూ దుబాయ్‌లో సన్నిహితంగా కనిపించడం గమనార్హం.

దుబాయ్‌లో పుట్టిన రోజు జరుపుకొంటూ

దుబాయ్‌లో పుట్టిన రోజు జరుపుకొంటూ

దుబాయ్‌లో అలయా తన 22వ బర్త్ డే వేడుకను బాల్ థాక్రే మనవడు ఐశ్వరీ థాక్రేతో జరుపుకొన్న ఫోటో మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా పలు సందర్భాల్లో, పలు పార్టీల్లో వారిద్దరి కలిసి అతి చనువుగా ఉండటం మరింత అనుమానాలను రాజేసింది. ఫిబ్రవరిలో అలయా, ఐశ్వరీ థాక్రే, ఆయన తల్లి స్మిత థాక్రే కలిసి లంచ్ పార్టీలో కనిపించడంతో వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ముదిరిందనే ప్రచారం మీడియాలో జరిగుతున్నది.

ఐశ్వరీతో నాది స్నేహబంధం మాత్రమే

ఐశ్వరీతో నాది స్నేహబంధం మాత్రమే

అయితే ఐశ్వరీ థాక్రేతో తన రిలేషన్‌పై అలాయా స్పందించింది. ఐశ్వరీతో ఉన్నది కేవలం స్నేహబంధం మాత్రమే. ఆయన నాకు మంచి స్నేహితుడు అంటూ అలయా చెప్పింది. తన కూతురు డేటింగ్ వ్యవహారంపై వస్తున్న వార్తలను తల్లి పూజాబేడీ ఖండించారు. ఊహాగానాలతో అలా వ్యక్తిగత జీవితాన్ని అంచనా వేయవద్దు అంటూ కామెంట్ చేసింది.

Recommended Video

SSMB 28 లో Mahesh Babu పాత్ర ఇదేనట | Mahesh Babu Trivikram Movie || Filmibeat Telugu
అలయా ఎఫ్ కెరీర్‌ ఇలా. ..

అలయా ఎఫ్ కెరీర్‌ ఇలా. ..

ఇక అలయా భేడి కెరీర్ విషయానికి వస్తే.. తల్లి పూజాబేడి వారసత్వాని పుణికి పుచ్చుకొని నటిగా అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమైంది. ఇటీవల సైఫ్ ఆలీ ఖాన్, టబు నటించిన జవానీ జానేమన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ చిత్రంలో అలయా ఎఫ్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X