కన్న కూతురికి ఫస్ట్ కిస్ విలువ నేర్పిన డైరెక్టర్ మహేష్ భట్.. షూటింగ్‌లో పక్కకు తీసుకెళ్లి..

బాలీవుడ్ సీనియర్ దర్శకుల్లో ఒకరైన మహేష్ భట్ ఒకప్పుడు సినిమాలకు సంబందించిన టాపిక్స్ తో వార్తల్లో నిలిచేవారు కానీ ఇప్పుడు వరుసగా కాంట్రవర్సీ న్యూస్ లతో నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా మహేష్ భట్ కూతుళ్లు కూడా ఈ మధ్య కాలంలో కొన్ని కాంట్రవర్సీలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక మహేష్ భట్ పెద్ద కూతురు పూజ భట్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రి చెప్పిన కిస్ సీన్ వాల్యూ పై స్పందించింది.

బికినీ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న శామా సికందెర్

యాక్షన్ ప్లస్ రోమాంటిక్..

యాక్షన్ ప్లస్ రోమాంటిక్..

మహేష్ భట్ ఎలాంటి సినిమా కూడా ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేవి. యాక్షన్ ప్లస్ రోమాంటిక్ సన్నివేశాల్లో ఆయన మేకింగ్ నెవర్ బిఫోర్ అనేలా ఉండేది. కొన్ని సినిమాలు ఇప్పుడు చూసినా కూడా బోర్ కొట్టవు. అయితే ప్రస్తుత కాలంలో ఆయన పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు. ఆయన వారసురాలిగా అలియా భట్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

నైనా గంగూలీ.. ప్రతి ఫ్రేమ్ లో హాట్ నెస్ డోస్ పెంచేస్తోంది

కూతురిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి

కూతురిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి

అలియా భట్.. మహేష్ రెండవ భార్య కూతురు. ఇక మొదటి భార్య కూతురు పూజ భట్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంది. అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసే దర్శకులు చాలా వరకు కూతుళ్ళను సినీ ఫీల్డ్ కు దూరంగానే ఉంచేవారు. అలాంటి టైమ్ లో తన మొదటి కూతురును మహేష్ భట్ హీరోయిన్ గా మార్చాడు.

సంజీదా షేక్ కూల్ గ్లామరస్ లుక్స్

19ఏళ్ళ వయసులో ఫస్ట్ కిస్

19ఏళ్ళ వయసులో ఫస్ట్ కిస్

పూజ భట్ 19ఏళ్ళ వయసులోనే ఫస్ట్ కిస్ అనుభవాన్ని చూసినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అది కూడా తన తండ్రి మహేష్ భట్ కారణంగానే ధైర్యంగా చేశానని చెప్పుకొచ్చింది. పూజ భట్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో సడక్ ఒకటి. సంజయ్ దత్ ఆ సినిమాలో హీరోగా నటించాడు.

కంగారు పడిపోయిందట

కంగారు పడిపోయిందట

1991లో వచ్చిన సడక్ సినిమాతోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి సినిమా కావడంతో రోమాంటిక్ సన్నివేశాల్లో చాలా ఇబ్బంది పడిందట. ఇక ముద్దు సీన్ అనేసరికి కంగారు పడిపోయిందట. కొంతసేపటి వరకు భయంతో వణికిపోయినట్లు చెప్పింది.

అర్థమయ్యేలా చెప్పారట

అర్థమయ్యేలా చెప్పారట

అయితే ఆ సమయంలో దర్శకుడిగా ఉన్న తండ్రి మహేష్ భట్ పక్కకు తీసుకువెళ్లి ఆ సీన్ గురించి అర్థమయ్యేలా చెప్పారట. నువ్వు కిస్ సన్నివేశాన్ని వల్గర్ గా ఫీల్ అయితే అది అలానే కనిపిస్తుంది. అదే ఆ సీన్ విలువ తెలుసుకొని గౌరవంతో ఇష్టపడి నటిస్తే సీన్ అద్భుతంగా వస్తుంది..కథలో భాగంగా సన్నివేశం విలువ తెలుసుకోవాలని.. మహేష్ భట్ వివరించినట్లు పూజ భట్ చెప్పుకొచ్చింది.

తండ్రి సపోర్ట్ తోనే..

తండ్రి సపోర్ట్ తోనే..

ఫైనల్ గా తండ్రి సపోర్ట్ తోనే ఆ ముద్దు సన్నివేశంలో ధైర్యంగా నటించాను. షూటింగ్ సమయంలో ఆయన చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. అలాంటి ఆలోచనతోనే కెమెరా ముందు నిబద్దతో నటిస్తాను.. అని పూజ భట్ వివరణ ఇచ్చింది. ఇక సడక్ సినిమాకు సీక్వెల్ గా చేసిన సడక్ 2 గత ఏడాది అక్టోబర్ లో హాట్ స్టార్ లో రిలీజ్ అవ్వగా.. డిజాస్టర్ టాక్ ను అందుకుంది. ట్రైలర్ పై భారీ స్థాయిలో డిస్ లైక్స్ వచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X