ఓ తాగుబోతు వ్యక్తితో సంబంధం పెట్టుకుని.. హీరోయిన్‌పై లేడి డైరెక్టర్ సంచలనం!
బాలీవుడ్ లో తనుశ్రీ దత్త లైంగిక ఆరోపణలు ఎలాంటి దుమారం రేపుతున్నాయో అందరికి తెలిసిందే. దిగ్గజ నటుడు నానా పాటేకర్ హార్న్ ఓకే ప్లీజ్ చిత్ర షూటింగ్ లో భాగంగా వేధించాడని తనుశ్రీ ఆరోపించడంతో జాతీయ మీడియాలో సైతం హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ ఘటన విషయంలో పలువురు సినీప్రముఖులు తనుశ్రీ దత్తకు మద్దత్తు తెలుపుతున్నారు. మరికొందరు తనుశ్రీ ఆరోపణల్లో వాస్తవం లేదని నానా పాటేకర్ కు అండగా నిలుస్తున్నారు. తాజగా తనుశ్రీ ఆరోపణలపై ప్రముఖ మమహిళా దర్శకురాలు పూజ భట్ తనుశ్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

10 ఏళ్ల తరువాత గుర్తుకు వచ్చిందా
అమితాబ్, సల్మాన్, అమిర్ ఖాన్ వంటి నటులు ఈ విషయంలో మౌనం వహించడానికే ఇష్టపడ్డారు. సోనమ్ కపూర్, స్వరభాస్కర్, రవీనా టాండన్ వంటి హీరోయిన్లు తనుశ్రీ మద్దత్తు తెలుపుతున్నారు. తాజాగా ఓ సమావేశంలో పూజ భట్ తనుశ్రీ, నానా పాటేకర్ వివాదం గురించి స్పందించింది. ఇన్నిరోజులు సైలెంట్ గా ఉండి పదేళ్ల తరువాత ఎందుకు మాట్లాడుతోందని పూజ భట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

నానా పాటేకర్‌ని పొగిడారు
చాలా మంది నానా పాటేకర్ ని గతంలో పొగిడారు. విమర్శించిన వారుకూడా ఉన్నారు. కానీ పొగిడినవారే ఇప్పుడు తిడుతున్నారని పూజ భట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలా అని తనుశ్రీని సైలెంట్ గా ఉండమని నేను చెప్పడం లేదు. ఈ విషయంలో విచారణ జరగాలని కోరారు.

ఆమె గతాన్ని కూడా చూడండి
విచారణ జరిగే సమయంలో తనుశ్రీ గతాన్ని కూడా బయటకు తీయాలి. ఆ సమయంలో తనుశ్రీ గురించి ఎవరెవరు ఎలా మాట్లాడుకున్నారో అన్ని బయటకు రావాలి అని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పూజ భట్ పరోక్షంగా నానా పాటేకర్ కు మద్దత్తు తెలుపుతున్నట్లు తేలింది.

తాగుబోతు వ్యక్తితో సంబంధం
తాను కూడా గతంలో ఓ తాగుబోతు వ్యక్తితో సంబంధం పెట్టుకున్నానని పూజా భట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సందర్భంలో ఆ వ్యక్తి నన్ను కొట్టాడు కూడా. ఆ విషయం బయటకు చెబితే ఇండస్ట్రీ మొత్తం నన్నే విమర్శించారు. అలాంటి విషయాలని ఎందుకు పెద్దది చేస్తావు అని సలహా ఇచ్చారు. మహేష్ భట్ కుమార్తెగా ఇండస్ట్రీలో గందరగోళం సృష్టించడం ఇష్టం లేక సైలెంట్ గా ఉన్నానని పూజా తెలిపింది.


Click it and Unblock the Notifications











