పూనమ్ పాండే మరో సంచలనం... ‘బెడ్ టైమ్ స్టోరీస్’
ఇంటర్నెట్ సంచలనం పూనమ్ పాండే హాట్ అండ్ సెక్సీ యాటిట్యూడ్‌తో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ఈ ముంబై బ్యూటీ తన ఒంపుసొంపులే పెట్టుబడిగా భారీ ఆదాయాన్నిపొందుతోంది.
ఆదాయం పెంచుకోవడంలో భాగంగా తన పేరుతో సొంతగా యాప్ లాంచ్ చేసిన పూనమ్.... ఇందులో హాట్ వీడియోలు, ఫోటోలు అప్ లోడ్ చేస్తూ అభిమానులు అలరిస్తోంది. త్వరలో 'బెడ్ టైమ్ స్టోరీస్' పేరుతో అభిమానులకు మరింత కిక్కెక్కించేందుకు సిద్ధమైంది.

తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా 'బెడ్ టైమ్ స్టోరీ' పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ స్టోరీ నాటీ యంగ్ గర్ల్స్ & బాయ్ కోసమే అని, బెడ్ టైమ్ స్టోరీస్ ద్వారా వారంలో మూడు రాత్రులు ఎంటర్టెన్మెంట్ పంచబోతున్నట్లు పూనమ్ వెల్లడించారు. ఆమె పోకడ చూస్తుంటే మరిన్ని డర్టీ పనులు చేయబోతోందనేది స్పష్టమవుతోంది.
ఈ పోస్టర్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోర్న్ సినిమా పోస్టర్ చూసినట్లుగా ఉందని కొందరు మండి పడుతున్నారు. అయితే పూనమ్ ఇవేమీ పట్టించుకోకుండా తను చేసేది చేసుకుంటూ వెళుతోంది.


Click it and Unblock the Notifications











