నాకు పోర్న్ వద్దు.. అమ్మ-చెల్లి పాత్రలు కావాలి.. మనసు మార్చుకున్న వివాదాస్పద నటి
బోల్డ్ నటి పూనమ్ పాండే ఇప్పుడు తన బోల్డ్ అండ్ గ్లామర్ ఇమేజ్ కాకుండా సీరియస్ పాత్రల కోసం వెతుకుతోంది. పూనమ్ సినిమాల్లో అమ్మ-చెల్లెలు లాంటి క్యారెక్టర్స్ చేసి అభిమానులకు తన యాక్టింగ్ స్కిల్స్ చూపించాలని కోరుకుంటుంది. తాజాగా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ వివరాలు

బహిరంగంగా
తాజాగా ఇంటర్వ్యూలో పూనమ్ పాండే తన ఇమేజ్ గురించి, సోషల్ మీడియాలో పోస్ట్‌లు మరియు పోర్న్ ఇండస్ట్రీ గురించి బహిరంగంగా మాట్లాడింది. పూనమ్ తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడానికి బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అసలు ఆ విషయంలో చింతించనని చెప్పింది. తద్వారా నా ఫాలోవర్స్ పెరుగుతారు అని పూనమ్ చెప్పుకొచ్చింది. నేను ఉద్దేశపూర్వకంగా అలాంటి చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని వెల్లడించింది.

భర్తకు ఇష్టం అని
నేను నా బోల్డ్ చిత్రాలను పూర్తి నిజాయితీతో పంచుకుంటాను. నేను అలానే ఉన్నాను. మీరు నన్ను బోల్డ్ అని పిలిస్తే, అది నాకు గౌరవమైన పదం. మన సమాజం ఆలోచనా ధోరణి వేరు కావచ్చు కానీ నేను కలిసిన వాళ్లంతా వేరు అని ఆమె చెప్పుకొచ్చారు. కొంతమంది . మహిళలు నా దగ్గరకు వచ్చి, నా భర్తకు నువ్వు అంటే చాలా ఇష్టం అని అంటున్నారు. చాలా మంది జంటలు వచ్చి నాతో ఫోటోలు దిగుతున్నారు. ఇది నా అభిమానుల ప్రేమ మాత్రమే. ఇప్పుడు జనాలు ఓపెన్ మైండెడ్ అయిపోయారు, ఇదంతా మామూలే అనుకుంటారని ఆమె వెల్లడించారు.

అందుకే ఇదంతా చేశా
ఇక శృంగారానికి, ఎరోటికాకు మనవాళ్లకు తేడా తెలియదు అని ఆమె వెల్లడించారు. ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం కోసమే ఇదంతా చేశానని, ఎందుకంటే నేను ఎప్పుడూ ఫాలోవర్స్‌ని కొనాలనుకోను. వీరు నా సొంతంగా సంపాదించిన ఫాలోవర్స్ అని అన్నారు. ప్రజలు చెప్పేది నేను ఎందుకు చేయాలి? అని ప్రశ్నించిన ఆమె వారి వ్యాఖ్యలను నేను పట్టించుకోను. నేను పోర్న్ ఇండస్ట్రీలో భాగమని చాలా మంది అంటున్నారు కానీ వారికి పోర్న్ మరియు ఎరోటికా మధ్య తేడా తెలియదని అన్నారు.

పోర్న్ కాదు
పూనమ్ ఇంకా మాట్లాడుతూ, నేనెప్పుడూ పోర్న్ ఇండస్ట్రీకి వ్యతిరేకం. ఇది మన దేశంలో ఆమోదయోగ్యం కాదు అలాగే ఉండకూడదు. మన దేశంలో పోర్న్ ఇండస్ట్రీ రావాలని నేను కోరుకోవడం లేదు. ఇది మన సంస్కృతికి పూర్తిగా విరుద్ధం. మన దేశం అనుమతించని వాటిని మనం ఎందుకు తీసుకురావాలి. పోర్న్ అనేది భారీ డీల్. నేను ఎరోటికా వీడియోస్ చేస్తాను. మన దేశం శృంగారానికి కూడా ప్రసిద్ధి, అది కామసూత్ర దేశం. అందులోకి పోర్న్ తీసుకురావద్దు. నేను బోల్డ్‌నెస్ గురించి ఎరోటికా మాట్లాడుతున్నా, ఇది అందమైనది, పోర్న్ కాదని ఆమె చెప్పుకొచ్చారు.

అమ్మగా కానీ, చెల్లిగా కానీ
ఇక తన భవిష్యత్ ప్రణాళికలపై పూనమ్ మాట్లాడుతూ, నేను పరిశ్రమలో గ్లామర్ డాల్‌గా పేరు తెచ్చుకున్నాను, అయితే నేను తరువాత సీరియస్ పాత్రలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఇంటెన్స్ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను. సినిమాల్లో అమ్మగా కానీ, చెల్లిగా కానీ నటించడానికి నాకు అభ్యంతరం లేదు. నాకు అవకాశం వస్తే, నేను ఖచ్చితంగా ఆ పాత్రలు చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











