For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మోడల్ మీద రాజ్ కుంద్రా లైంగిక దాడి.. 3000 కోట్ల స్కాం.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు!

  |

  చాలా రోజులుగా, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా హెడ్ లైన్స్ లోనే ఉంటున్నారు. అశ్లీల వీడియోలను తయారు చేసి యాప్ లో పెట్టి విక్రయించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజ్ కి 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక రాజ్ కుంద్రా మీద బీజేపీ నాయకుడు రామ్ కదమ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  శారీరకంగా వేధించాడు

  శారీరకంగా వేధించాడు

  రాజ్ కుంద్రా మోడల్ కమ్ నటిని శారీరకంగా వేధించాడని ఆరోపించారు. రామ్ కదమ్ మాట్లాడుతూ, "2021, ఏప్రిల్ 14 న, ఒక ప్రముఖ మోడల్ కమ్ నటి తాను శారీరకంగా వేధించాడని ఆరోపిస్తూ, జుహు పోలీస్ స్టేషన్ లో రాజ్ కుంద్రా పై ఫిర్యాదు చేసింది, కానీ ఈ ఫిర్యాదు కొనసాగలేదు. అదే సమయంలో, ఆమె ఒత్తిడి వచ్చింది. దేంతో ఈ ఫిర్యాదును మోడల్ ఉపసంహరించుకుందని అన్నారు. నటిపై ఒత్తిడి తెచ్చిన ఈ వ్యక్తులు ఎవరు ? అని ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.

  మూడు వేల కోట్ల మోసం

  మూడు వేల కోట్ల మోసం

  ఇక ఈ విషయంలో రాజ్ కుంద్రా పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈరోజు బిజెపి నాయకులు రామ్ కదం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ రాజ్ కుంద్రా పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాజ్ మూడు వేల కోట్ల మోసానికి పాల్పడ్డాడని కూడా ఆయన అన్నారు. వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 'గేమ్ ఆఫ్ డాట్' అనే ఆన్‌లైన్ గేమ్‌ను ప్రారంభించిందని రామ్ కదమ్ తెలిపారు. ఈ ఆట పేరుతో దేశంలో పలువురు పంపిణీదారుల నుండి మోసం చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని ఆయన అన్నారు.

  శిల్పా శెట్టిని ఉపయోగించాడు

  శిల్పా శెట్టిని ఉపయోగించాడు

  అలాగే, అతను డబ్బు సంపాదించి అందరితో సంబంధాన్ని తెంచుకున్నాడని అన్నారు. "రాజ్ కుంద్రా ఈ ఆటను ప్రమోట్ చేయడానికి భార్య శిల్పా శెట్టిని ఉపయోగించాడు మరియు పంపిణీదారులను ఆకర్షించాడు. మోసానికి పాల్పడిన తరువాత, ఈ వ్యక్తులపై కేసులు పెట్టబడ్డాయి అని అన్నారు. రామ్ కదమ్ మాట్లాడుతూ, ఇది చట్టబద్దంగా పని చేస్తున్నామని చెప్పే సంస్థ, కానీ వారు ప్రజలను మోసం చేశారని మరియు అన్ని నియమాలను ఉల్లంఘించారని చెప్పారు.

  కఠిన చర్యలు తీసుకోకపోతే

  కఠిన చర్యలు తీసుకోకపోతే

  మూడు రోజుల్లోగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే, ముంబై పోలీస్ కమిషనర్ మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తామని రామ్ కదమ్ చెప్పారు. దీనితో పాటు, ప్రభుత్వం ఈ అన్యాయాన్ని ఎలా సహించిందో తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు మోసపోతున్నారని, ప్రభుత్వం చూస్తూనే ఉందని అన్నారు. ఇక గేం థానే డిస్ట్రిబ్యూటర్ రాజు నాయక్ మాట్లాడుతూ, నేను, నా స్నేహితులతో కలిసి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టానని, దానికి బదులుగా చాలా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిన్చామని అన్నారు.

  నేరుగా కలవలేదు కానీ

  నేరుగా కలవలేదు కానీ

  ముందుగా రూ. 25 లక్షలు ఇవ్వాలని మమ్మల్ని అడిగారు, కానీ మేము కలిసి రూ. 10 లక్షలు మాత్రమే ఏర్పాటు చేయగలిగాము. శిల్పా శెట్టి పేరు అందులో ఉంటే లాభం చేకూరుతుందని మేం అనుకున్నామని అన్నారు. అయితే మేము రాజ్ కుంద్రా లేదా శిల్పా శెట్టిని కలవలేదని నాయక్ చెప్పారు. మేము మేనేజర్ ను మాత్రమే కలుసుకున్నామని, అతను ఆట గురించి మాకు వివరించాడు. మూడు నెలల తరువాత మేమంతా మోసపోయామని గ్రహించామని అన్నారు. మేము చాలాసార్లు అక్కడికి వెళ్లి వాళ్ళని కలవడానికి ప్రయత్నించామని, కానీ ఏ ఒక్కరూ మమ్మల్ని కలవలేదని అన్నారు. అందుకే మేము పోలీసుల వద్దకు వెళ్ళామని అన్నారు.

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
  శిల్పా శెట్టి పేరు విన్నాక పెట్టాం

  శిల్పా శెట్టి పేరు విన్నాక పెట్టాం


  శిల్పా శెట్టి పేరు విన్న తర్వాత నేను కూడా డబ్బు పెట్టుబడి పెట్టానని సోలాపూర్ పంపిణీదారు సంతోష్ మోర్ తెలిపారు. నేను చెక్కు ద్వారా ఏడు లక్షల రూపాయలు ఇచ్చాను. ఈ గేమ్‌లో చాలా స్కోప్ ఉందని మరియు ఈ పనులన్నీ చట్టబద్ధమైనవని మాకు చెప్పారని అన్నారు. మాకు పెద్ద స్క్రీన్‌లు మరియు కంప్యూటర్‌లు కూడా ఇస్తామని వాగ్దానం చేశామని అన్నారు. దీనితో పాటు మనకు కావలసినప్పుడు ఎప్పుడైనా మన డబ్బును తిరిగి పొందవచ్చని కూడా చెప్పారని అన్నారు. కొన్ని రోజుల తర్వాత మేమందరం మోసపోయామని గ్రహించామని అన్నారు. మేము మా డబ్బును తిరిగి అడిగినప్పుడు, మమ్మల్ని ఆఫీసు నుండి బయటకు తోసేశారని అన్నారు.

  English summary
  BJP spokesperson Ram Kadam has levelled serious allegations against Raj Kundra. In his recent media interaction, Kadam claimed a popular actress accused Kundra of sexually assaulting her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X