గుండెపోటుతో ప్రముఖ నటి కన్నుమూత, షాక్‌లో బాలీవుడ్

ప్రముఖ నటి, రంగస్థల కళాకారిణి ఉషా గంగూలి గుండెపోటుతో దక్షిణ కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. లేక్ గార్డేన్స్ ఏరియాలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆమె మృతికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సినీ ప్రముఖులు షబానా ఆజ్మీ, అపర్ణాసేన్ సంతాపం వ్యక్తం చేశారు.

 ఉషా గంగూలీ గురించి

ఉషా గంగూలీ గురించి

నటి ఉషా గంగూలీ వయసు 75 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్‌కు కుటుంబానికి చెందిన ఆమె జోధ్‌పూర్‌లో జన్మించారు. చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకొని హిందీ సాహిత్యం నేర్చుకోవడానికి కోల్‌కతాకు మకాం మార్చారు. 1976లో రంగ కర్మీ అనే గ్రూపులో చేరడం ద్వారా నాటక రంగంలోకి ప్రవేశించారు. మహాభోజ్, రుడాలి, కోర్ట్ మార్షల్స్, ఆంతర్యాత్ర లాంటి పేరొందని నాటకాల్లో కీలక పాత్రను పోషించారు.

 ఉషా గంగూలీ కెరీర్

ఉషా గంగూలీ కెరీర్

బెంగాల్‌లో హిందీ థియేటర్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టు అత్యంత ప్రేక్షకాదరణ కూడగట్టారు. స్వయంగా ముఖ్తి, మానసి లాంటి సొంత ప్రొడక్షన్ హౌస్‌లను స్థాపించారు. అజయ్ దేవగన్, ఐశ్వర్యరాయ్ నటించిన రెయిన్ కోట్ చిత్రానికి దర్శకురాలు రితుపర్ణో ఘోష‌తో కలిసి కథా సహకారం అందించారు. గుడియా ఘర్ నాటకంలో ఆమె దర్శకత్వ శాఖలో ప్రతిభకుగాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెకు సంగీత నాటక అకాడమీ అవార్డును ఇచ్చింది.

మమతాబెనర్జీ, షబానా, అపర్ణ సంతాపం

మమతాబెనర్జీ, షబానా, అపర్ణ సంతాపం

ఉషా గంగూలీ మరణవార్తను తెలుసుకొన్న సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. నాటక రంగానికి తీరని లోటు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులకు మమతాబెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నటి అపర్ణాసేన్ స్పందిస్తూ ఇకలేరని వార్తను నమ్మలేకపోతున్నాను అని అన్నారు. నాటక రంగానికి దిక్సూచిలా నిలిచిన ఉషా గంగూలీ మరణవార్తను విని తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాను. ఆమెతో కలిసి పార్, ఇతర ప్రొడక్షన్లలో కలిసి పనిచేశాను. నాటక రంగంలో ఆమెకు ఆమే సాటి. ఏ లోకంలో ఉన్నప్పటికీ ఆమె శాంతి చేకూరాలి అని షబానా ఆజ్మీ ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.

Recommended Video

Naga Shaurya Emotional On Stage | Aswathama Trailer | Aswathama Pre Release Event
ముగిసిన అంత్యక్రియలు

ముగిసిన అంత్యక్రియలు

ఉషా గంగూలీ అంత్యక్రియలు గురువారం సాయంత్రం కియోరటాల శ్మశాన వాటికలో కుటుంబ, బంధు, రంగకర్మి సభ్యుల సమక్షంలో ముగిసాయి. ఆమె కుమారుడు అంత్యక్రియలను నిర్వహించారు. ఉషా భరత్ కొద్ది సంవత్సరాల క్రితమే కన్నుమూయగా, ఆమె సోదరుడు మూడు రోజుల క్రితమే మరణించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X