twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియన్ సినిమా కోసం పోర్చుగల్‌లో బ్రిడ్జ్‌ను రెండు రోజులు క్లోజ్ చేశారట

    |

    బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ - యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వార్'. పూర్తి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను సిద్దార్ద్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. యస్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో వాణీ కపూర్ నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగుతో పాటు మరికొన్ని చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    రెండు రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో హృతిక్, టైగర్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి మరీ నటించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఇద్దరు హీరోల మధ్య వచ్చే కార్‌ ఛేజింగులు, భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలుస్తోంది.

    Porto Bridge Closed Two Days For Hrithik Roshan, Tiger Shroff War movie

    వీటితో పాటు హీరోయిన్ వాణీ కపూర్ బికినీ సీన్స్ బాగుంటాయని అంటున్నారు. దీని తర్వాత రన్నింగ్ చేజ్, హెలీకాఫ్టర్ సీన్స్, కార్ చేజ్ సీన్లతో పాటు బీచ్‌లో డ్యాన్స్ తదితర సన్నివేశాలు చూపించారు. మొత్తంగా ఈ ట్రైలర్ హృతిక్ వర్సెస్ టైగర్‌లా పవర్ ప్యాక్‌డ్‌గా సాగింది. ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఇక, తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను ఏడు దేశాల్లో తెరకెక్కించారు. అందులో పోర్చుగల్ కూడా ఉంది. ముఖ్యంగా ఆ దేశంలోనే ఫేమస్ అయిన పోర్టో బ్రిడ్జ్‌పైనా కొన్ని సన్నివేశాలు తీశారట. ఇందుకోసం రెండు రోజులు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేయాలని స్థానిక అధికారులను యూనిట్ కోరింది. స్థానిక అధికారుల సహాయంతో బ్రిడ్జిపై రెండు రోజులపాటు హృతిక్, టైగర్ ష్రాఫ్‌పై ఫైట్ సీన్‌ను షూట్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది.

    English summary
    Hrithik Roshan and Tiger Shroff’s quintessential venture War has created a humongous buzz post its trailer release among the viewers. The film has been shot in 7 countries and 15 cities across the world and we are really excited
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X