For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    చిత్రహింసలు అనుభవించా.. నా మానసిక స్థితి సరిగాలేదు.. ప్రియుడితో విడిపోయాక!

    |

    ఇండియన్ ఐడల్ తో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ నేహా కక్కర్ తాజాగా సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది. ప్రియుడు హిమాన్ష్ కోహ్లీ నుంచి విడిపోయాక తన మానసిక పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో తెలిపింది. నటుడు హిమాన్ష్ తో కొంత కాలం ప్రేమాయణం సాగించిన నేహా విభేదాల కారణంగా గత ఏడాది విడిపోయారు. నేహా కక్కర్ ఇంస్టాగ్రామ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నేహా కక్కర్ ఇంస్టాగ్రామ్ లో చేసిన కామెంట్స్ ఏంటో ఇపుడు చూద్దాం.

    వేదికపైనే

    వేదికపైనే

    ఇండియన్ ఐడల్ వేదిక పైనే హిమాన్ష్ కోహ్లీ, నేహా కక్కర్ పై ఉన్న ప్రేమని తెలియజేశాడు. తామిద్దరం ప్రేమికులం అని ప్రకటించుకున్నారు. హిమన్షు పరిచయం అయ్యాకే తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మొదలయిందని పలు సందర్భాల్లో నేహా తెలిపింది. కానీ వీరిద్దరి ప్రేమకు బ్రేకులు పడడానికి ఎక్కువరోజులు సమయం పట్టలేదు.

     డిప్రెషన్‌లో ఉన్నా

    డిప్రెషన్‌లో ఉన్నా

    హిమాన్షు నుంచి విడిపోయాక నేహా కక్కర్ పై అనేక కామెంట్స్ వినిపించాయి. ఇప్పటికి కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె ట్రోలింగ్ కూడా గురైంది. దీనితో నేహా కక్కర్ ఎమోషనల్ గా స్పందించింది. నేనిప్పుడు డిప్రెషన్ లో ఉన్నా. ఈ ప్రపంచంలో చెడుగా ఆలోచించే వ్యక్తులందరికి ధన్యవాదాలు. మీ వల్ల చిత్రహింసలు అనిభావించా. ఇంతలా నన్ను మానసిక క్షోభకు గురిచేయడంతో మీరు విజయవంతం అయ్యారు అంటూ నేహా కక్కర్ పేర్కొంది.

    నా వ్యక్తిగత జీవితాన్ని

    నా వ్యక్తిగత జీవితాన్ని

    నేను చెబుతున్నది ఒకరిద్దరి గురించి కాదు. ప్రపంచం మొత్తం గురించి మాట్లాడుతున్నా. నేనిలా మానసిక వేదన అనుభవిస్తున్నానంటే అందుకు కారణం నా వ్యక్తిగత జీవితాన్ని విమర్శించే వారివల్లే. నా ప్రతిభని, నన్ను ఇష్టపడే వారందరికీ కృతజ్ఞతలు. కానీ కొందరు నేనెంటో, నా వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో కొంచెం కూడా తెలుసుకోకుండా కామెంట్స్ చేస్తున్నారు. అటువంటి వారివల్ల చాలా వేదన అనుభవించా.

    నన్నిలా బతకనివ్వండి

    నన్నిలా బతకనివ్వండి

    నెగిటివ్ కామెంట్స్ చేసే వారందరిని అడుక్కుంటున్నా.. దయచేసి నన్ను ఇలా సంతోషంగా బతకనివ్వండి. నా గురించి తెలియకుండా ఏకపక్షంగా మాట్లాడకండి. అంటూ నేహా సోషల్ మీడియా ద్వారా వేడుకుంది. హిమాన్షుతో బ్రేకప్ కావడంతో ఓ షోలో నేహా ఎమోషనల్ అయి కంటతడి కూడా పెట్టుకుంది.

    English summary
    Post break up with Himansh Kohli, Neha Kakkar CONFIRMS she is in depression! Guess Neha Kakkar is finding it difficult to cope up with the heartbreak.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more