Adipurush నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్: ఆ ఒక్క దానిలోనే సెంచరీ చేసేసిన ప్రభాస్ సినిమా

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' నుంచి పంథాను మార్చుకుని వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభం నుంచి తెలుగు చిత్రాలకు మాత్రమే పరిమితం అయిన అతడు.. ఈ మధ్య బహుభాషా చిత్రాలను చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకుని.. ఈ యూనివర్శల్ స్టార్ చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. వాటిలో ఒక్కొక్క మూవీని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక, ప్రభాస్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో పౌరాణిక కథతో వస్తున్న 'ఆదిపురుష్' చాలా ప్రత్యేకమైనది చెప్పుకోవచ్చు.

బాలీవుడ్‌లో చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. దీని ద్వారా మన స్టార్ హీరో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టును ఇందులో చూపించబోతున్నారు. వీఎఫ్ఎక్స్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని ఆటంకాలు ఏర్పడడంతో ఆలస్యం అయింది. ఇప్పుడు ముంబైలో చివరి షెడ్యూల్‌ను శరవేగంగా నడిపిస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక, పౌరాణిక కథతో వస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతుందన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ముంబైలోని మధ ద్వీపంలో దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి నటీనటుల డేట్స్‌ను బట్టి షూటింగ్‌ను జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా యాక్షన్ పార్ట్ షూటింగ్ అరుదైన మైలురాయిని చేరుకుందని తెలుస్తోంది.

 Prabhass Adipurush Action Shoot Complete 100 Days

వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న 'ఆదిపురుష్' యాక్షన్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తై నేటికి వంద రోజులు అవుతున్నట్లు తెలిసింది. దీన్ని పురస్కరించుకుని తాజాగా చిత్ర యూనిట్ సెట్స్‌లో సంబరాలు కూడా జరుపుకుందని అంటున్నారు. ఇందులో హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా భాగం అయినట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఇక, మరికొన్ని రోజుల్లో టాకీ పార్ట్ పూర్తి కాబోతున్నట్లు బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే, వీఎఫ్ఎక్స్ షాట్స్ కోసం నటీనటులు కొద్ది రోజులు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుందని అంటున్నారు.

'ఆదిపురుష్' మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను 2022 ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X