For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆగిపోయిన ప్రభాస్ సినిమా షూటింగ్: ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతోనే ఈ నిర్ణయం

    |

    ఈ మధ్య కాలంలో వరుస సినిమాలను ప్రకటిస్తూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఒకటి పట్టాలపై ఉండగానే మిగిలినవి కూడా ప్రారంభించేశాడు. ఫలితంగా ఒక దాని తర్వాత ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే 'రాధే శ్యామ్' సినిమాను దాదాపుగా పూర్తి చేసిన అతడు.. కొద్ది రోజులుగా 'ఆదిపురుష్' మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ తక్కవ మంది సిబ్బందితోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

    బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో భాగంగానే ముంబై నగర శివారులోని మధ ద్వీపంలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అవకముందే దీన్ని ఆపేసినట్లు తాజాగా తెలిసింది. మహారాష్ట్రం ప్రభుత్వం షూటింగులను ఆపేయాలని సూచించడం వల్లే 'ఆదిపురుష్' యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రభాస్ హైదరాబాద్ వచ్చేశాడని అంటున్నారు.

    Prabhas Adipurush Shoot Stopped

    మంచి మీద చెడు గెలవడం అనే కాన్సెప్టుతో వస్తున్న 'ఆదిపురుష్'తో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ రావణుడిగా చేస్తున్నారు. టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ శ్రీరామనవమి సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

    English summary
    Prabhas's Adipurush is said to be the adaptation of the Indian epic that revolves around the triumph of good over evil. According to Hindu mythology, Lord Ram is also addressed as Adi Purusha. Prabhas will be seen playing the role of Lord Rama and Saif will play the role of Lankesh, the demon King Ravan, in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X