For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌లోకి బాలీవుడ్ స్టార్లు: ప్రభాస్ అదిరిపోయే ప్లాన్.. సీక్రెట్‌గా ఫినీష్ చేయడానికే ఇలా!

  |

  తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే పాన్ ఇండియా స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఈ జాబితాలో ప్రథమంగా చెప్పుకోవాల్సిన పేర్లలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' నుంచి అతడి స్టామినా ప్రపంచానికి పరిచయం అయింది. అందుకే వరుసగా పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న వాటిలో 'ఆదిపురుష్' అనే బాలీవుడ్ సినిమా కూడా ఉంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఆ సంగతులు మీకోసం!

  బాలీవుడ్ బ్యూటీ డైసీ షా.. గ్లామరస్ బ్యూటీ స్టైలిష్ లుక్ (ఫోటో గ్యాలరీ)

  ఆ సినిమాలతో హిందీలో క్రేజ్ పెరిగింది

  ఆ సినిమాలతో హిందీలో క్రేజ్ పెరిగింది

  ప్రభాస్ హీరోగా రాజమౌళి తీసిన ‘బాహుబలి' సిరీస్ తెలుగులోనే కాక హిందీలోనూ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీని తర్వాత వచ్చిన ‘సాహో' అయితే మన దగ్గర ఆడకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఆ ఏడాది ఎక్కువ కలెక్షన్ చేసిన చిత్రంగానూ నిలిచింది. ఈ రెండు చిత్రాల వల్ల హిందీ పరిశ్రమలో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది.

  అది ఉండగానే... మరిన్ని ప్రాజెక్టులతో

  అది ఉండగానే... మరిన్ని ప్రాజెక్టులతో

  వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్' అనే సినిమాను చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే.. నాగ్ అశ్విన్‌తో ఓ పాన్ వరల్డ్ సినిమాను ప్రకటించాడు. ఇది ఇంకా ప్రారంభం కాలేదు. అలాగే, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్' అనే సినిమాను మాత్రం ప్రారంభించేశాడు.

  ‘ఆదిపురుష్'తో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ

  ‘ఆదిపురుష్'తో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ

  యంగ్ రెబెల్ స్టార్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న చిత్రమే ‘ఆదిపురుష్'. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్న విషయం తెలిసిందే.

  ఎవరూ టచ్ చేయని కథతో వస్తుందిగా

  ఎవరూ టచ్ చేయని కథతో వస్తుందిగా

  చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో.. రామయాణంలో ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌తో ‘ఆదిపురుష్' రూపొందుతోంది. ఈ చిత్రంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. సీతగా టాల్ బ్యూటీ కృతీ సనన్, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను చేస్తున్నాడు. వీరితో పాటు ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.

  సినిమా షూటింగ్ అప్‌డేట్ ఏమిటంటే

  సినిమా షూటింగ్ అప్‌డేట్ ఏమిటంటే

  ‘ఆదిపురుష్' మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ముంబై నగరంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రారంభించారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే, మధ ద్వీపంలో కొద్ది రోజుల పాటు షూటింగ్ చేశారు. మొత్తంగా ఈ సినిమాకు ఇప్పటి వరకూ స్టార్లతో 60 రోజుల చిత్రీకరణ జరిగింది. ఈ లోపు కరోనా ప్రభావం భారీగా పెరగడంతో చిత్రీకరణను నిలిపేశారు.

  హైదరాబాద్‌కు ఆదిపురుష్ యూనిట్

  హైదరాబాద్‌కు ఆదిపురుష్ యూనిట్

  ముంబైలో షూటింగ్ జరుపుకునే పరిస్థితులు లేకపోవడంతో ‘ఆదిపురుష్' యూనిట్ హైదరాబాద్ రాబోతుందని శుక్రవారామే ఓ వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఇక్కడ దాదాపు వంద రోజుల పాటు షూటింగ్ జరుపుకోకున్నారని అంటున్నారు. ఇందుకోసం ప్రభాస్ వ్యక్తిగత టీమ్ తగిన ఏర్పాట్లను కూడా జరుపుతుందని ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  Adipurush ఛలో హైదరాబాద్, RFC లోనే బెటర్ అన్న Prabhas | Salaar || Filmibeat Telugu
  సీక్రెట్‌గా ఫినీష్ చేయడానికే ఇలా రాక

  సీక్రెట్‌గా ఫినీష్ చేయడానికే ఇలా రాక

  ‘ఆదిపురుష్' సినిమాకు సంబంధించి ఇప్పుడు చేయాల్సిన షూటింగ్ అంతా గ్రీన్ మ్యాట్‌తో కూడినదేనట. అంటే ఇది మొత్తం ఇండోర్‌లోనే షూట్ చేస్తారు. సో.. దీనికి తగిన ప్రదేశం హైదరాబాద్ అని ప్రభాస్ చిత్ర యూనిట్‌కు సూచించాడట. అందుకే ఇందులో పని చేసే స్టార్లంతా ఇక్కడికి వస్తున్నారని సమాచారం. దీని వల్ల మిగిలిన చిత్రాల షూటింగ్ కూడా ప్రభాస్‌కు ఈజీ కాబోతుంది.

  English summary
  Prabhas's Adipurush is said to be the adaptation of the Indian epic that revolves around the triumph of good over evil. According to Hindu mythology, Lord Ram is also addressed as Adi Purusha. Prabhas will be seen playing the role of Lord Rama and Saif will play the role of Lankesh, the demon King Ravan, in the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X