For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prabhas సినిమాకు వరుస ఆటంకాలు: జోతిష్యులను ఆశ్రయించిన నిర్మాతలు.. వాళ్లిచ్చిన సలహా ఏంటంటే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తన సత్తాను నిరూపించుకుని.. 'బాహుబలి' మూవీ నుంచి పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అప్పటి నుంచి వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తోన్న అతడు.. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. ఈ చిత్రం ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నిర్మాతలు జోతిష్యులను ఆశ్రయించారట. దీంతో వాళ్లు ఓ సలహా ఇచ్చారని తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

  కెమెరాకు చిక్కిన ప్రిన్స్ నరులా, యువిక.. ఫొటోస్ వైరల్

  ఆ రెండు సినిమాలతో ఫేమస్ అయ్యాడు

  ఆ రెండు సినిమాలతో ఫేమస్ అయ్యాడు

  ఆరంభంలో ఓ మోస్తరు బడ్జెట్ సినిమాల్లో నటించాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కానీ, దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి' తర్వాత అతడి రేంజ్ పెరిగిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ యూనివర్శల్ స్టార్ అయ్యాడు. ఆ వెంటనే వచ్చిన ‘సాహో'తో హిందీలో మార్కెట్‌ను కూడా పెంచుకున్నాడు. అందుకే అన్ని భాషల్లో ఆడకున్నా.. ఇది అక్కడ సూపర్ హిట్ అయింది.

   ‘రాధే శ్యామ్' రాకముందే.. అవి మొదలు

  ‘రాధే శ్యామ్' రాకముందే.. అవి మొదలు

  రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘రాధే శ్యామ్'. ఇది షూటింగ్ పూర్తవకు ముందే.. నాగ్ అశ్విన్‌తో ఓ పాన్ వరల్డ్ సినిమాను ప్రకటించాడతను. అలాగే, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్' అనే సినిమాను మాత్రం ప్రారంభించేశాడు. దీనితో పాటు ఓ బాలీవుడ్‌ చిత్రంలోనూ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ రెండింటినీ ప్రారంభించేశాడు కూడా.

   బాలీవుడ్‌లో అడుగు పెడుతోన్న ప్రభాస్

  బాలీవుడ్‌లో అడుగు పెడుతోన్న ప్రభాస్

  ప్రభాస్ బాలీవుడ్‌లోని అడుగు పెడుతోన్న చిత్రమే ‘ఆదిపురుష్'. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో వస్తుంది. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

  పాత కథే.. కొత్త పాయింట్‌తో వస్తున్నారు

  పాత కథే.. కొత్త పాయింట్‌తో వస్తున్నారు


  ‘ఆదిపురుష్' సినిమా రామాయణం నాటి కథతో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇది చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో.. రామయాణంలో ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. సీతగా కృతీ సనన్, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను చేస్తున్నాడు.

  మకాం మార్చేస్తున్న ‘ఆదిపురుష్' టీమ్

  మకాం మార్చేస్తున్న ‘ఆదిపురుష్' టీమ్

  కొద్ది రోజుల క్రితం ‘ఆదిపురుష్' మూవీ షూటింగ్ ముంబై నగరంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రారంభించారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే, మధ ద్వీపంలో కొద్ది రోజుల పాటు షూటింగ్ చేశారు. ఇప్పటి వరకూ స్టార్లతో 60 రోజుల చిత్రీకరణ జరిగింది. ఈ లోపు కరోనా ప్రభావం భారీగా పెరగడంతో చిత్రీకరణను నిలిపేశారు. కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ వస్తున్నారు.

  జోతిష్యులను ఆశ్రయించిన నిర్మాతలు

  జోతిష్యులను ఆశ్రయించిన నిర్మాతలు

  ‘ఆదిపురుష్' మూవీ ప్రకటించినప్పటి నుంచే ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. కోవిడ్ ఫస్ట్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆలస్యం కాగా.. ఆ తర్వాత ప్రారంభోత్సవం రోజే అగ్నిప్రమాదం జరిగింది. ఇక, ఇప్పుడేమో సెకెండ్ వేవ్ కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఇలా అనుకోని ఆటంకాలు వస్తుండడంతో చిత్ర నిర్మాతలు తాజాగా జోతిష్యులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

  Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
  జోతిష్యులు ఇచ్చిన సలహా ఏమిటంటే

  జోతిష్యులు ఇచ్చిన సలహా ఏమిటంటే

  తాజా సమచారాం ప్రకారం.. ఆదిపురుష్ టీమ్‌కు జోతిష్యులు ఓ సలహా ఇచ్చినట్టు తెలిసింది. దీని ప్రకారం.. ప్రభాస్‌తో సహా సినిమాలో భాగమైన అందరూ కలిసి ఓ భారీ హోమంలో పాల్గొనబోతున్నారట. సినిమా దిగ్విజయంగా పూర్తి అయ్యేందుకు దీనిని నిర్వహించబోతున్నారని తెలిసింది. అయితే, ఇది కోవిడ్ టైమ్‌లో జరుగుతుందా? తర్వాత ఉంటుందా? అన్నది తెలీలేదు.

  English summary
  Prabhas Now doing mythological film Adipurush. This Movie Unit to do a Homam for Solve Problems.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X