Adipurush: ప్రభాస్ మూవీలో హైలైట్ లీక్.. ఏ రామాయణంలో చూపని విధంగా!

కెరీర్ ఆరంభంలో తెలుగు సినిమాలకే పరిమితమై.. టాలీవుడ్‌లో బడా హీరోగా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అయితే, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి వరుసగా భారీ ప్రాజెక్టులను మాత్రమే చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్.. ఇటీవలే 'రాధే శ్యామ్' అనే సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాలు, భాషల్లో నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా కలెక్షన్లను ఏమాత్రం రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్రం దాదాపు రూ. 120 కోట్ల నష్టాలను ఎదుర్కొంది. తద్వారా టాలీవుడ్‌లో ఎక్కువ నష్టాలను చవి చూసిన మూవీగా చెత్త రికార్డును నమోదు చేసుకుంది.

ఈ మధ్య కాలంలో ప్రభాస్ చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఒక్కొక్క మూవీని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక, ప్రభాస్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో పౌరాణిక జోనర్‌లో వస్తున్న 'ఆదిపురుష్' ఒకటి. బాలీవుడ్‌లో చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ మూవీతో మన స్టార్ హీరో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టును ఇందులో చూపిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తి అయింది.

Prabhas and Kriti Sanon Chemistry Highlight in Adipurush Movie

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైనా.. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు. దీనికి కారణం ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్‌కే ఎక్కువ సమయం పడుతుండడమే. దాదాపు దీని కోసమే నిర్మాతలు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను వీఎఫ్ఎక్స్ వండర్‌గా తీయబోతున్నారు. కాబట్టి వీలైనంత ఎక్కువ సమయం తీసుకున్నా.. మంచి ఔట్‌పుట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందుకోసం దాదాపు వంద మంది టెక్నీషియన్లు నిరంతరాయంగా పని చేస్తూనే ఉన్నారని తెలుస్తోంది.

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. జానకీ అలియాస్ సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ సొట్టబుగ్గల సుందరి కృతి సనన్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సీతా రాముల మధ్య కెమిస్ట్రీని ఎంతో అందంగా చూపించబోతున్నారట. ఇప్పటి వరకూ వచ్చిన రామయణం ఆధార సినిమాల్లో చూపించని విధంగా ఇందులో వీళ్ల కెమిస్ట్రీని హైలైట్ చేయబోతున్నారని ఓ న్యూస్ బీ టౌన్ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సీన్స్‌కు సంబంధించిన ఫైనల్ ఔట్‌పుట్ కూడా వచ్చేసిందని తెలిసింది. ఇదంతా ఎంతో అందంగా, అద్భుతంగా వచ్చిందని అంటున్నారు.

'ఆదిపురుష్' మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను చేస్తున్నారు. అలాగే, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే జనవరిలో విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X