బెట్టింగ్ వివాదంలో ప్రభాస్ హీరోయిన్ కూడా.. శ్రద్దా మిస్టేక్ కూడా లెక్కేస్తారా?
ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వినిపిస్తున్న వివాదాస్పద అంశం ఏదన్నా ఉంది అంటే అది ఆన్లైన్ బెట్టింగ్స్ కోసమే అని చెప్పవచ్చు. ఎప్పుడు నుంచో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ తెలుగు స్టేట్స్ లో చలామణిలో ఉన్నాయి కానీ ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ అలానే ఇంకొందరు సినీ ప్రముఖుల్ని కేసు బుక్ చేయడం అనేది సంచలనంగా మారింది.
కాగా మొదట చిన్న గానే తీగ కదిలింది కానీ తర్వాత డొంక మాత్రం పెద్దదే అయ్యిందని చెప్పాలి. ఇలా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, బాలకృష్ణ ఇంకా రానా సహా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ల వరకు కూడా ఇది వెళ్ళింది. కాగా ఇక్కడ నుంచి పరిస్థితి ఎటు వెళుతుంది అనేది ఎవరికీ అర్ధం కాలేదు కానీ ఇపుడు ఊహించని విధంగా ప్రభాస్ హీరోయిన్ అది కూడా బాలీవుడ్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ స్టార్ బ్యూటీ అయినటువంటి శ్రద్దా కపూర్ ఇందులో ఇరుక్కుంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కాగా చాలా మంది హీరోలు హీరోయిన్లు అంతెందుకు స్టార్ క్రికెటర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ ని ఆన్లైన్ కరెన్సీ లాంటి వాటిని ప్రమోట్ చేశారు కానీ కొందరు మాత్రం తమ ప్రమేయం లేకుండా ఇరుక్కుంటారు. అదే ఎప్పుడైనా పలువురు స్టార్స్ సోషల్ మీడియా అకౌంట్ లు హ్యాక్ అయినపుడు. ఇలాంటి చాలా మంది స్టార్స్ ఎదుర్కొన్నారు. ఇక ఈ లిస్ట్ లో ఇపుడు స్త్రీ 2 సెన్సేషన్ బ్యూటీ శ్రద్దా కపూర్ కూడా బాధితురాలు అయ్యింది.
తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ అకౌంట్ ఇపుడు హ్యాక్ అయినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఆమె నుంచి ఆన్లైన్ బెట్టింగ్స్ పలు పలు పోస్ట్ లు కూడా చేయడం జరిగింది. అయితే ఇది సడెన్ గా చూసిన వారు శ్రద్దా కపూరే ఇవి చేసిందా అని షాకవుతున్నారు. సరే తన అకౌంట్ హ్యాక్ అయ్యింది అనుకుంటే తన ఇన్స్టాగ్రామ్ నుంచి అయినా కూడా దీనిపై ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం అనేది గమనార్హం.
దీంతో శ్రద్దా కపూర్ గాని వాంటెడ్ గా పోస్ట్ చేసి ఉంటే మాత్రం ఈ బెట్టింగ్స్ వివాదంలో ఇరుకున్నట్టే అవుతుందని చెప్పక తప్పదు. మరి శ్రద్దా కపూర్ ఖాతా హ్యాక్ అయ్యిందా లేక ఆమె నుంచే సస్పెన్స్ ఫుల్ పోస్ట్ లు పడ్డాయా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా కొన్నాళ్ల కితమే మన తెలుగు యువ హీరో అక్కినేని నాగ చైతన్య ఖాతా నుంచి కూడా ఇలానే తాను బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేశాను మీరు కూడా చేయండి అంటూ పలు పోస్ట్ లు పడ్డాయి.
దీనితో వెంటనే చైతు టీం దానిని సరిచేశారు. కానీ శ్రద్దా టీం నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక శ్రద్దా కపూర్ హీరోయిన్ గా పలు భారీ సినిమాలు చేస్తుండగా ఆమె హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ భారీ సినిమా వార్ 2 లో కూడా ఉన్నట్టుగా పలు రూమర్స్ ఉన్నాయి. అలాగే తెలుగులో పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో సినిమాలో రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











